మన తెలంగాణ జర్నలిస్టు దారుణ హత్య ఇంట్లో ఉండగానే కత్తులతో వచ్చి దాడి
జర్నలిస్టు దారుణ హత్య
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనికి చెందిన ఆరుకొల్ల శ్రీనివాస్ అలియాస్ బుగ్గల శ్రీను దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ ప్రస్తుతం మన తెలంగాణ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ తన నివాసంలో ఉండగా దుండగులు కత్తులతో చొరబడి పొడిచి చంపారు. హంతకులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. శ్రీనివాస్ పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన భార్య పై కూడా దాడికి పాల్పడ్డారు దుండగులు. అయితే పాత కక్షలే శ్రీనివాస్ హత్యకు కారణంగా పలువురు చెబుతున్నారు. గతంలో గోదావరిఖని 1టౌన్ కానిస్టేబుల్ ఎర్రగొల్ల శ్రీనివాస్ హత్య కేసులో జర్నలిస్టు రమేష్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
99 టివి సిబ్బందిపై దాడి
హైదరాబాద్ లో 99 టివి రీపోర్టర్ రాజేష్... కెమెరా మాన్ నరేష్, డ్రైవర్ సూరి లపై మద్యం మత్తులో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ దాడిలో రిపోర్టర్ రాజేష్ కి స్వల్ప గాయాలయ్యా.యి. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో టి.ఆర్.యస్.ఎల్పీ సమావేశం కవర్ చేసుకొని తిరిగి వస్తుండగా 6.40 నిమిషాల కు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద ఘటన జరిగింది. అయితే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉండగా 99 టివి వాహనం అక్కడ ఆగింది. దీంతో తాగుబోతులు వచ్చి అకస్మాత్తుగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
