Asianet News TeluguAsianet News Telugu

ఈసారి తిరుపతిలో...

  • మొదటి సంవత్సరం కర్నూలులో
  • ఆ తర్వాతి ఏడాది విశాఖపట్నంలో
  • ఈ సారి ఈ అవకాశం తిరుపతికి దక్కనుంది
ap government will be celebrating independence day this year in tirupati

 

సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రతి రాష్ట్రంలో రాజధానిలో మాత్రమే జరుగుతుంటాయి. కానీ.. ఏపీలో మాత్రంలో వినూత్నంగా జిల్లాల్లో నిర్వహిస్తూవస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిరుపతిలో నిర్వహించ తలపెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రాంతంలో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది. మొదటి సంవత్సరం కర్నూలులో నిర్వహించారు. ఆ తర్వాతి ఏడాది విశాఖపట్నంలో, గతేడాది అనంతపురంలో నిర్వహించారు. అదేవిధంగా ఈ ఏడాది తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు మువ్వన్నల జెండాను ఎగురవేయనున్నారు.

ఇలా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా స్థానిక ప్రజలంతా వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈ సారి ఈ అవకాశం తిరుపతికి దక్కనుంది.

కాగా తిరుపతిలో ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. భద్రతా సిబ్బంది ఇప్పటి నుంచి భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే తిరుపతిలోని ఎస్ యూవీ గ్రౌండ్స్ లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం

Follow Us:
Download App:
  • android
  • ios