35 సంవత్సరాలుగా పనిచేసిన డిపార్ట్ మెంట్ ను వీడిపోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ వీడ్కోలు సభలో అనురాగ్ శర్మ బావోద్వేగానికి లోనయ్యాడు. ఇవాళ రాజ్ బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా డిజిపి గానే కాకుండా డిపార్ట్ మెంట్ నుండి పదవీ విరమణ పొందుతున్న అతడికి మిగతా పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు తెలిపారు. 
ఈ సంధర్భంగా అనురాగ్ శర్మ మాట్ాడుతూ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనురాగ్ శర్మ ప్రసంగం కింది విధంగా సాగింది.
1992లో పాతబస్తి డీసీపీగా అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాను.
2012లో హైదరాబాద్ సీపీగా భాద్యతలు చేపట్టాను.అప్పుడు సిటీలో కర్ఫ్యూ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం.
రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని సవాళ్ళను అధిగమించేలా పోలీసింగ్ చేసాం.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను అదుపులో పెట్టేందుకు ముఖ్యంమంత్రి కేసీఆర్ మాకెంతో సహకరించారు.
డిపార్ట్ మెంట్ ను బలోపేతం చేసి బెస్ట్ పోలీసింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చారు.
హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ సీపీ లతో పాటు ఇంటలీజెన్స్,స్పెషల్ బ్రాంచ్,సీ.ఐ.డీ పోలీసులు నాకు ఎంతో సహకరించారు.
 హోంగార్డు నుండి ఐజీల వరకు రాష్ట్ర పోలీసింగ్ ను ప్రపంచ వ్యాప్తంగా చాటారు.
నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ప్రజలు భాగస్వాములు అయ్యారు.
సోషల్ మీడియాతో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాం.
రానున్నరోజుల్లో డీజీపీగా మహేంధర్ రెడ్డి రాష్ట్ర పోలీసింగ్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
 ఇలా తన కెరీర్ లో జరిగిన విషయాలన్నింటిని నెమరువేసుకున్నారు అనురాగ్ శర్మ. ఇకపై కూడా తన అవసరాన్ని బట్టి పోలీస్ డిపార్ట్ మెంట్ కు తన అనుభవపూర్వక సేవలు అందిస్తానని అనురాగ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖలోని హోం గార్డ్ నుండి సీనియర్ ఐపీఎస్ అధికారులు మరియు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.