తమిళనాడు శశికళ కు మరో ఝలక్

First Published 17, Nov 2017, 4:49 PM IST
another shock to shashikala
Highlights
  • శశికళ భర్త నటరాజన్ ను దోషిగా తేల్చిన మద్రాస్ హైకోర్ట్
  • రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే సీఎం పదవిని ఆశించి భంగపడి, అక్రమాస్తులు కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు మరో షాక్ తగిలింది. ఆమె భర్త నటరాజన్ ను ఓ కేసులో దోషిగా తేలుస్తూ మద్రాస్ హైకోర్టులో తీర్పు వెలువరించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే శశికళ భర్త నటరాజన్  ఓ ఖరీదైన కారును విదేశాల్లోంచి తెప్పించే క్రమంలో సుంకాన్ని ఎగ్గొట్టి చిక్కులో ఇరుకున్నాడు. అతడు 1994లో లెక్సస్ కంపెనీకి చెందిని ఓ ఖరీదైన కారును ఆర్డర్ చేసి బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఈ కారును తన ప్రెండ్ మరియు బందువైన బాస్కరన్ కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ కారుకు సంభందించిన సుంకాన్ని ఎగ్గొట్టడానికి ఆ కారును ఇంతకు ముందే వాడిన కారుగా చూపించారు. ఈ విధంగా కొత్తకారు దిగుమతికి చెల్లించాల్సిన సుంకం రూ.1.16 కోట్ల ను ఎగ్గొట్టారు. దీనిపై కేసు నమోదు కాగా 23 ఏళ్లుగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తుదకు మద్రాస్ హైకోర్టు తుదితీర్పు వెలువరిస్తూ అతడికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 

 

loader