అక్రమ సంబంధాల కేసుల్లో చిక్కుకుని పోలీస్ శాఖ పరువు తీసుస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇటీవల అక్రమ సంబంధం పెట్టకుని కుటుంబసభ్యులకు అడ్డంగా దొరికిపోయిన ఎసిబి అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లిఖార్జునరెడ్డి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఉన్నతాధికారులే తప్పు చేశారు, తాను చేస్తు తప్పేముంటుందని అనుకున్నాడో ఏమో ఓ ఎస్సై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆ మహిళ భర్త గమనించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ పోలీస్ అక్రమ సంబంధం బైటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి. 

 జవహర్‌నగర్ పీఎస్‌లో నరసింహా ఎస్సైగా పనిచేస్తున్నాడు.  అయితే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే జ్యోష్ణాదేవి అనే మహిళ తన భర్త వేధింపులపై పోలీసులకు  ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అయితే ఆమెకు భర్తతో ఉన్న విబేధాలను ఆసరాగా చేసుకున్న ఎస్సై వివాహితపై కన్నేశాడు. మాయమాటలతో ఆమెను లోబర్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  

ఇంతటితో ఆగకుండా ఆ మహిళ భర్తకు ఎస్సై ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో భయపడ్డ భర్త సతీష్ ఈ విషయాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళాడు. ఎస్సై నర్సింహ తనను బెదిరిస్తున్నాడని, ఆయన బారి నుంచి కాపాడాలని కోరుతున్నాడు. ఇలాంటి వ్యవహారాలపై ఇప్పటికే సీరియస్ గా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఈ ఎస్సై పై కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.