కృష్ణా నదిలో మరో బోటు బోల్తా...

First Published 17, Nov 2017, 3:50 PM IST
another boat accident in andhra pradesh
Highlights

కృష్ణా నదిలో మరో బోటు ప్రమాదం

సీఎం నివాపానికి అతి సమీపంలో ఘటన

 

గుంటూరు: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది. నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా పడవ మునిగి పోయింది. అయితే ప్రమాదాన్ని ముందే గ్రహించిన పడవలోని కార్మికులు నదిలోకి దూకేశారు. దీంతో కార్మికులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

పరిమితికి మించి ఇసుకను లోడ్‌ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి అతి సమీపంలో ఈ బోటు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కృష్ణా నది పవిత్ర సంగమం చేరువలో పడవ బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరుణం చెందిన విషయం తెలిసిందే. 

కాగా పవిత్ర సంగమం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం అనుమతి లేకుండా బోటు నడుపుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయినా ఫలితం శూన్యమని తాజా ఘటన చెబుతోంది. అంత ఘోర ప్రమాదం జరిగినా బోటు నిర్వాహకుల తీరు మారడం లేదు.

 

loader