ఇటీవల ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా నిర్వహించిన ఎస్జీటీ పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయని, ఉద్యోగం రాదేమోనని ఓ నిరుద్యోగ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయ వృత్తినే ప్రాణంగా భావించి చదివానంటూ, అదే సాధించలేక పోతుండటంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది.  

వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన జాప సుప్రజ(24) గత ఐదేళ్లుగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతోంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విడుదల చేసిన టీఆర్టీ నోటిపికేషన్ లో బాగంగా ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన పరీక్ష రాసిన సుప్రజ తక్కువ మార్కులు వస్తాయని  తీవ్రంగా కుంగిపోయింది. తనకు ఉద్యోగం రాకపోతే తన ఐదేళ్ల కష్టం వృధా అవుతుందని ఆవేధనకు లోనైంది. మళ్లీ తల్లిదండ్రులకు భారంగా మారకూడదన్న ఉద్దేశ్యంతో ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. బుదవారం ఇంట్లో ఎవరూ లేసి సమయంలో  సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ లెటర్ లో తనకు ఉరి వేసుకోవడం ఎలాగో తెలియడం లేదంటూ రాసి కూడా  ఉరివేసుకుని అందరికీ విషాదాన్ని మిగిల్చింది.  
 
 ఈ సూసైడ్ లెటర్ ని చదివేవారి హృదయం ద్రవించేలా రాసింది సుప్రజ. తనకు నాన్నను ఒక్కసారి చూసి చనిపోవాలనుందని తీవ్ర ఆవేధన వ్యక్తం చేసింది. అయితే అది  కుదరలేదంటూ లెటర్ లో రాసిపెట్టింది. (తండ్రి లింగారెడ్డి కుటుంబ పోషణ కోసం దుబాయికి వలప వెళ్లాడు). అమ్మ, అక్కా, భావ తనను క్షమించాలంటూ, తాను అనుకున్నట్లు జీవించలేక పోతున్నా అందుకే తనకు తానుగా శిక్ష విధించుకుంటున్నానంటూ ఆవేధన వ్యక్తం చేసింది.

ఈ ఆత్మహత్యపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ లెటర్ ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరిపుతున్నట్లు పోలీసులు తెలిపారు.