ఇవాళ కోర్టులో హాజరుకానున్న ప్రదీప్ (వీడియో)

anchor pradeep drunken drive case
Highlights

  • డ్రంకెన్ డ్రైవ్ తనిఖిలో పట్టుబడ్డ ప్రదీప్
  • ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహించనున్న పోలీసులు
  • జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్న న్యాయ నిపుణులు
  •  

ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ వేడుకల్లో తప్పతాగి వాహనం నడుపుతూ, పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 న పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ లో ప్రదీప్‌ను పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45లో ట్రాఫిక్ పోలీసులు ప్రదీప్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. దీంట్లొ 178 పాయింట్లు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసు ఇవాళ కోర్టు ముందుకు రానుంది. సాధారణంగా 100 పాయింట్లు నమోదైతేనే జైలు శిక్ష పడుతుంది. కానీ ప్రదీప్ మద్యం మోతాదు 178 పాయంట్లు దాటింది. దీంతో కోర్టు అతడికి జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మొదట కౌన్సెలింగ్ ఇచ్చి ఆ తర్వాత కోర్టుకు హాజరుపరుస్తారు. ఇలా డిసెంబర్ 31 న పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మొత్తం 2400 మందికి ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అందరితో పాటే యాంకర్ ప్రధీప్ కు కూడా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నారు.  

 

ప్రదీప్ డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన వీడియో

 

loader