అమెరికాలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఇండియన్ టెకీ కూచిబొట్ల శ్రీనివాస్ గత ఏడాది పిబ్రవరిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడు పూరింటన్ ను అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. తాజా విచారణలో నిందితుడు ఆడం పూరింటన్‌ కూచిబొట్ల ను తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఇలా నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  

 గత ఏడాది ఫిబ్రవరి 27న కూచిబొట్ల తన స్నేహితుడు అలోక్ తో కలిసి కాన్సస్‌లోని ఆస్టిన్స్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లో మద్యం సేవించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ప్యూరింటన్ వీరిపై జాత్యంహకార దూషణలు చేస్తూ కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులను అడ్డుకోడానికి ప్రయత్నించిన అమెరిన్ ఇయాన్ పై కూడా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ మరణించగా, అలోక్,ఇయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై అప్పటినుండి విచారణ కొనసాగుతుండగా తాజాగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. విద్వేశపూరితంగా తన భర్తను చంపిన నిందితుడికి శిక్ష పడితేనే తనకు న్యాయం జరిగినట్లుగా బావిస్తానని కూచిబొట్ల భార్య సునయన తెలిపింది.