మీ బంగారానికి ఇన్సూరెన్స్ చేయించారా..?

All You Need To Know About Gold Insurance
Highlights

  • బంగారానికి  ఇన్సూరెన్స్ అవసరం
  • బ్యాంక్ లాకర్లలో 100 శాతం సేఫ్ కాదు

బంగారానికి ఇన్సూరెన్స్ చేయించడం ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే.. ఇంటికి.. కారుకు ఎలా అయితే ఇన్సూరెన్స్ చేయించుకుంటామో.. బంగారానికి కూడా అలానే చేయించాలి. ఇటీవల విజయవాడలోని ఓ బంగారు తయారు చేసే దుకాణంలో దోపిడీ దొంగలు పడ్డారు. దుకాణంలోని వారిని బెదిరించి దాదాపు 7కేజీల బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. పోలీసులు చాకచక్యంతో వారిని పట్టుకోగలిగారుకోండి.. ఒకవేళ దొంగలు దొరకకపోతే.. దొరికినా.. ఆ బంగారం తిరిగి దుకాణ యజమానికి లభించకపోతే.. ఆ వ్యక్తి చాలా నష్టపోవాల్సి వస్తుంది. అదే ఆ వ్యక్తి తన దుకాణంలోని బంగారిని ఇన్సూరెన్స్ చేయించి ఉంటే తనకు ఎలాంటి నష్టం ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మొత్తం క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 

మీరనుకోవచ్చు.. బ్యాంక్ లాకర్లలో బంగారు ఆభరణాలు పెట్టుకుంటే సేఫ్ గానే ఉంటాయి కదా.. అని . కానీ ఆ ఆలోచన చాలా తప్పు.. బ్యాంక్ లాకర్లలో కూడా బంగారు ఆభరణాలు 100 శాతం సేఫ్ గా ఉంటాయని చెప్పలేం.

 

అసలు బంగారాన్ని ఎందుకు పరిరక్షించుకోవాలి..?

బంగారం మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కేవలం అలంకరణ కోసమే కాదు..ఆర్థిక సమస్యలు తలెత్తి .. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.. డబ్బు చాలా అవసరం.. ఎలా..? అలాంటి సమయంలో బంగారం ఉపయోగపడుతుంది. మన వద్ద ఉన్నబంగారంతో సమస్య పరిష్కరించుకోవచ్చు.

 

అంతేకాదు.. బంగారం మన ఒంటిపై ఉన్నప్పుడు ఎవరైనా దొంగతనం చేసినా కూడా ఇన్సూరెన్స్ దోహదపడుతుంది. బంగారం చోరి జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఎఫ్ఐఆర్ కాపీతో ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు. దాదాపు చాలా మంది గోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారత్ లో లిమిటెడ్ ఎమౌంట్ ని మాత్రమే అందజేస్తున్నాయి. అలా కాకుండా అనుకోని ప్రమాదం జరిగి మనం  బంగారం  కోల్పోతే.. పూర్తి మొత్తాన్ని పొందగలిగే  ఇన్సూరెన్స్ లు కూడా ఉన్నాయి. హయ్యర్ ప్రీమియమ్ ఎమౌంట్ కట్టడం ద్వారా ఈ అవకాశాన్ని మనం పొందవచ్చు.

యుద్ధాలు, టెర్రరిస్టుల దాడి లాంటి సంఘటనలు జరిగిన సమయంలో బంగారం కోల్పోడం.. ఏదైనా డామేజ్ జరిగితే మాత్రం దానికి కంపెనీలు బాధ్యత వహించవు. మిగిలిన సమయాల్లో మాత్రం నష్టం వాటిల్లిన 30 రోజుల్లో పరిహారం అందజేస్తారు.

అధిల్ షెట్టి  బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

loader