పేరుకే ఎయిర్ బస్ కానీ  సేవల్లో ఎర్ర బస్సే (వీడియో)

airhostess seen collecting left over liquor in Emirates airways
Highlights

  • ఆ విమానంలో ఎర్రబస్సు కంటే అధ్వాన్నమైన సేవలు 
  • మిగిలిపోయిన మందును కొత్త సీసాల్లో నింపి అందిస్తున్నారు
  • వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో వైరల్

 

విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఎంత నాసిరకం సేవలు అందిస్తున్నాయో తెలియచేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంతో ఉత్తమమైన సేవలు అందిస్తామని చెప్పుకునే ఎమిరేట్స్ విమానయాన సంస్థకు సంభందించిన విమానంలో ఈ సంఘటన జరగడం గమనార్హం.

దుబాయ్  నుంచి బార్సిలోనా వెళ్తున్న  విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్  మిగిలిపోయిన మద్యాన్ని ఖాళీ బాటిళ్లలో  నింపుతూ కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికుడు సెల్‌ఫోన్‌లో బందించాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

ఈ వీడియోని  బిజినెస్ క్లాసులో తీసినట్లు స్పష్టంగా కనబడుతోంది. బిజినెస్ క్లాస్ పరిస్థితే ఇలా ఉంటే ఎకానమీలో పరిస్థితిని ఊహించలేమని ప్రయాణికులు వాపోతున్నారు.

ఈ విషయంపై ఎమిరేట్స్ విమాన సంస్థకు చెందిన  అధికార ప్రతినిధి వివరిణ ఇస్తూ.. వీడియోలోని నిజానిజాలు తెల్సుకోడానికి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.అయితే ఈ వీడియో చూసిన వారు మాత్రం విమానంలో ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం నిజమేనని వాపోతున్నారు.

loader