Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ మామ, మంత్రి లక్ష్మారెడ్డి పై రేవంత్ మరో బాంబ్

  • మరోసారి మంత్రులపై విరుచుకుపడ్డ రేవంత్
  •  లక్ష్మారెడ్డి సర్టిఫికేట్ పై మరోసారి ప్రశ్నలు సంధించిన రేవంత్
  • గుల్బర్గా కాలేజ్ ప్రిన్సిపల్ మాటలు కూడా నమ్మశక్యంగా లేవన్న రేవంత్
again revanth reddy fires on minister laxma reddy

టీఆర్ఎస్ మంత్రి లక్ష్మారెడ్డి, కేటీఆర్ మామ పాకాల హరినాథ్ పై  రేవంత్ రెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. లక్ష్మారెడ్డి డాక్టర్ పట్టాపై గుల్బర్గా హెచ్కే కాలేజ్ ప్రిన్సిపల్   సంపత్ రావు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రి లక్ష్మారెడ్డి నిజంగానే తమ కాలేజీలో చదువుకున్నాడని ఆయన తెలిపాడు. దీనిపై స్పందించిన రేవంత్ అది నిజమే అయితే మంత్రి సర్టిఫికేట్ ను వారు మీడియాకు ఎందుకు చూపించలేదని ప్రశ్నించాడు. 1985లో తమ కళాశాలకు అనుమతి వచ్చిందని ప్రిన్సిపాలే చెప్పారు. అప్పటివరకు సీసీహెచ్ అనుమతి లేదని వారే చెబుతున్నారు. అనుమతి లేని కళాశాలలో చదివిన చదువు చెల్లుతుందా? అని ప్రశ్నించారు రేవంత్. అలాగే ప్రిన్సిపాల్ సంపత్ రావు కూడా తన పట్టా ను చూపించాలని రేవంత్ డిమాండ్ చేశాడు. తాను ఇదే లక్ష్మారెడ్డి వివరాలను 2015 లో  ఆర్టీఐ కింద అడిగితే 30  సార్లు తిప్పి ఇప్పటిదాకా వివరాలు ఇవ్వలేదని, ఇప్పుడేమో అతడే స్వయంగా వచ్చి వివరాలను వెల్లడించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రిన్సిపాల్, లక్ష్మారెడ్డి, అతడి స్నేహితులంతా కలిసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని...  వీరంతా శిక్షార్హులేనని రేవంత్ ఆరోపించాడు.


ఇంకా మంత్రి లక్ష్మారెడ్డి గురించి మాట్లాడుతూ... 2004 ఎన్నికల అఫిడవిట్ లో గుల్బర్గా యూనివర్సిటీలో 1988లో పాస్ అయ్యానని చెప్పారు.  2014 ఎన్నికల అఫిడవిట్ లో హెచ్కే యూనివర్సిటీ నుంచి 1987లో పాసయ్యానని చెప్పారు. లక్ష్మారెడ్డి 1987 లో పాసయ్యారా?  1988లో పాసయ్యారా? గుల్బర్గా యూనివర్సిటీనా? హెచ్కేఈ యూనివర్సిటీనా?  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.  గుల్బర్గా యూనివర్సిటీకి 1990లో అనుమతి వచ్చిందని, అలాంటిది 1988లోనే పాస్ కావడం మంత్రికే సాధ్యపడిందని ఎద్దేవా చేశాడు. చదువులోనే కాదు, ప్రాక్టీస్ సమయంలోను మంత్రి అవతవకలకు పాల్పడ్డాడని రేవంత్ తెలిపాడు. ఆయన తెలంగాణ బోర్డ్ ఫర్ హోమియోపతిలో నమోదు చేసుకున్నారా? చేయించుకుంటే ఆ పత్రం బయటపెట్టాలని సూచించాడు. 

ఇక లక్ష్మారెడ్డి గురువు సంపత్ రావు కూడా శిష్యుని బాపతోడేనని రేవంత్ విమర్శించాడు. లక్ష్మారెడ్డి ఉద్యోగం ఊడితే... ఆయనకు దొంగ సర్టిపికేట్ ఇచ్చినందుకు ప్రిన్సినల్ ఉద్యోగం కూడా ఊడుతుంది.  అందుకే లక్ష్మారెడ్డి తరపున వకాల్తా పుచ్చుకున్నాడు.లక్ష్మారెడ్డి కచ్చితంగా మున్నాబాయ్ ఆర్ఎంపీనే. ఈ వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నానన్నారు. తనను వదిలేయమని లక్ష్మారెడ్డి నా వద్దకు రాయబారం పంపారు.   కేటీఆర్ ఒత్తిడి వల్లనే నేనలా మాట్లాడిన అని రాయబారితో చెప్పించిండు. అయితే ఆ రాయబారితో నా అంతట నేను గీతదాటనని చెప్పానని రేవంత్ తెలిపాడు. కానీ, సోషల్ మీడియాలో నాపై ఎవరెవరితోనో ఇష్టారాజ్యంగా ప్రచారం చేయిస్తున్నారు. అందుకే మరోసారి నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని రేవంత్ తెలిపాడు. 

 
 అలాగే కేటీఆర్ మామ కూడా తప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ మీద ఉద్యోగం పొందారు. దానికి సమాధానం చెప్పమంటే చెప్పరు. అలాగే మంత్రి దొంగ సర్టిఫికేట్ గురించి అడిగితే సమాధానం చెప్పరు. కానీ వీటిని ప్రశ్నిస్తున్నందుకు తనను, తన కుటుంబ సభ్యులను చెప్పరాని భాష లో తిట్టిస్తున్నారని రేవంత్ ఆవేధన వ్యక్తం చేశాడు.  కేటీఆర్, లక్ష్మారెడ్డి లు నన్ను మానసికంగా ఒత్తిడి  తెస్తున్నారు. కానీ తనకు తన సామాజిక వర్గం అండ ఉందన్నారు రేవంత్.  కేటీఆర్ మామ మీద, లక్ష్మారెడ్డి సర్టిఫికెట్ మీద చర్చ  జరిపై దమ్మందా అంటూ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. 

Follow Us:
Download App:
  • android
  • ios