Asianet News TeluguAsianet News Telugu

''నేను రవ్వంత కాదు, నిప్పు రవ్వంత''

  • అధికార పార్టీ పై మరోసారి విరుచుకుపడ్డ రేవంత్
  • 24 గంటల కరెంట్ కాంగ్రెస్ చలవేనని వెల్లడి
  • దమ్ముంటే ఈ విషయంలో చర్చకు రావాలని మరో సారి సవాల్
  •  
again revanth fired on telangana governament

విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ సంస్థల ఏర్పాటులో జరుగుతున్న అవినీతిపై రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అధికార పార్టీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలను తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ ఎంపి సుమన్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ని విమర్శించాడు. అయితే ఈ విమర్శలపై రేవంత్ మరోసారి స్పందించాడు.  సుమన్ తనను రవ్వంత వ్యక్తినని విమర్శించడాన్ని రేవంత్ గుర్తుచేస్తూ " నేను నిజంగా రవ్వంత మనిషినే.. కానీ నిప్పు రవ్వంత మనిషిని, ఆ నిప్పురవ్వే అధికార పార్టీ అవినీతిని కాల్చేస్తుంది'' అంటూ ఎదురుదాడికి దిగారు. మేం చెప్పిన విషయాలనే టీఆర్ఎస్ నాయకులు మళ్లీ రిపీట్ చేస్తూ అవన్ని వారి హయాంలో జరిగినట్లు కలరింగ్ ఇస్తున్నారని  మండిపడ్డాడు. ఈ క్రెడిట్  అంతా తమ మొనగాడు కేసీఆర్ దే అని గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపాడు. ఈ 24 గంటల కరెంట్ గురించి అధికార పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని, అయితే ఇందులో వారి గొప్పతనం ఏం లేదని చెప్పడానికే తాను పలుమార్లు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలకు నిజాలు తెలయజేస్తున్నానని అన్నరు.    

 

ఇంకా రేవంత్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే....

 

కరెంట్ విషయంలో మాట్లాడితే ప్రభుత్వం పారిపోతోందని, మమ్మల్ని తిట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు.

అధికార పార్టీ నేతలే 2008లోనే విద్యుత్ కేటాయింపులు జరగాయంటున్నారు.  ఆ సమయంలో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్సే.  అంటే 24 గంటల విద్యుత్ అందించిన క్రెడిట్ కాంగ్రెస్ దే నని వారు ఒప్పుకున్నట్లే కదా. 

విభజన సమయంలో జనాభా ప్రాతిపదిక విద్యుత్ కేటాయింపు చేసి ఉంటే తెలంగాణకు నష్టం జరిగేది.  అయితే ఈ విసయంలో సోనియా విచక్షణతో ఆలోచించి వినియోగం ప్రాతిపదికన కేటాయింపులు జరిగేలా చూశారు. అందువల్లే 42 శాతానికి బదులు 53.89 శాతం విద్యుత్ లభించిందని తెలిపారు.

ఇక పవర్ ప్లాంట్ ల ఏర్పాటు విషయంలో అధికార పార్టీ సభ్యులు, అధికారుల అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని అన్నారు. కేవలం ఒక్క భద్రాద్రి పవర్ ప్లాట్ విషయంలోనే 23 మంది అధికారుల పై చర్యలు తీసుకోమని గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది.

అయితే ఈ విషయాన్ని తాను వెల్లడిస్తే, అంత మంది కాదు ఇద్దరు అధికారులపైనే చర్యలు తీసుకోమందని బాల్క సుమన్ చెబుతున్నాడు. అంటే ప్రభుత్వం తప్పు చేసిందని బాల్క సుమన్ ఒప్పుకున్నట్లే కదా.

ఇక ప్రభుత్వ రంగ సంస్థల నుండి విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, ప్రైవేట్ సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు చేసి కమీషన్లు పొందడానికి అధికార పార్టీ మొగ్గు చూపుతోంది. అందుకోసం జెన్ కో లాంటి సంస్థల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారు. 2012-13 లో జెన్ కో పీఎల్ఎఫ్ 84 శాతం ఉంది.  2016-17 కి వచ్చే సరికి జెన్ కో పీఎల్ఎఫ్ ను 69 శాతానికి తగ్గించారు.

అలాగే 2016 ఆగస్టు 15న జెన్ కో 44 వేల మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసింది. అదే ఆగస్టు 25 నాటికి దానిని 34 వేల మిలియన్ యూనిట్స్ కు తగ్గించారు. సరిగ్గా ఆ సమయంలో ప్రైవేటు కొనుగోళ్లు 11 వేల మిలియన్ యూనిట్ల నుంచి 41 వేల మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల విద్యుత్ ని కాదని, ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు మేలుచేయాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందుల ఉన్న మతలబేంటో అర్థం కావడం లేదా? 

తప్పుడు ఆరోపణలు చేస్తే కేసుపెట్టి జైల్లో తోస్తామని కేసీఆర్ అన్నారు. నా ఆరోపణలు ఆధారాలతో బయటపెడుతున్నా. తప్పైతే కేసు పెట్టండని మరో సవాల్ విసురుతున్నా.


ఇలా రేవంత్ అధికారపార్టీ నేతలు, అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios