తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ జలవిహార్ లో మంత్రి తలసాని ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున పాల్గొన్న సినీ నటుడు వేణు మాధవ్ సీఎం ను ప్రశంసలతో ముంచెత్తారు. అసలు కేసీఆర్ పేరులోనే ఆయన గొప్పతనం దాగుందన్నారు. సీఎం ఇంటి పేరు కల్వకుంట అంటే ప్రతి కాలువకు. కుంటకు నీరందించే కుటుంబం అని, చంద్ర శేఖరుడు అంటే చల్లని మనసు గలవాడని అర్థాలతో వివరించాడు వేణుమాధవ్. ఈ పేరు, ఇంటిపేరు  కలిగిన కేసీఆర్ నిజంగా అపర భగీరథుడే అన్నాడు వేణు మాధవ్. ఇంకా ఈ కార్యక్రమంలో వేణుమాధవ్ కేసీఆర్ ను ఎలా ప్రశంసలతో ముంచెత్తాడో కింది వీడియా లో మీరే చూడండి.