Asianet News TeluguAsianet News Telugu

చచ్చినా వదలని ఆధార్

  • మరణ ధ్రువ పత్రానికి సైతం ఆధార్ కావాల్సిందే
  • . అతనికి ఆధార్ లేదు అంటూ ఒక సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది
Aadhaar Must For Death Certificate From October 1 To Prevent Identity Fraud

 

ఆధార్ కార్డ్ మనం బతికి ఉన్నప్పుడే కాదండి..మనం చనిపోయాక కూడా కావాల్సిందే. ఏమిటి అర్థం కాలేదా.. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలు, పాన్ నెంబర్లు తీసుకోవాడానికి మాత్రమే ఆదార్ తప్పని సరి.. కానీ ఇక నుంచి మనం చనిపోయాక మన కుటుంబ సభ్యులు తీసుకునే మరణ ధ్రువ పత్రానికి సైతం ఆధార్ కావాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. ఈ విధానం అక్టోబర్  1 నుంచి అమలులోకి తసుకురానున్నారు.

అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. జమ్మూ కశ్మీర్, మేఘాలయ, అసోం రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

ఒక వేళ చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు సంఖ్య తెలియకపోతే.. అతనికి ఆధార్ లేదు అంటూ ఒక సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మరణ ధ్రువీకరణ పత్రం అధికారులు అందజేస్తారు. మరణ ధ్రువీకరణ పత్రం అప్లై చేస్తున్న వ్యక్తి ఆధార్ వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుందని వారు చెప్పారు. ఏదైనా అవకతవకలు చేయడం, తప్పుడు సమాచారం తెలియజేస్తే మాత్రం వారిని నేరస్తులుగా పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. గుర్తింపు కార్డులలో నెలకొంటున్న మోసాలను అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నట్లు వారు చెప్పారు.