బీరు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చట బీర్ లో ప్రో బయాటిక్ అనే బాక్టిరియా ఉంటుందట
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని విన్నాం..కానీ ఆరోగ్యానికి మేలు చేసే మద్యం కూడా ఉన్నాయని మీరు విని ఉండరు. మీరు చదివింది నిజమే.. బీరు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చట. సింగపూర్ కి చెందిన పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే.. సింగపూర్ కి చెందిన అల్కైన్ చాన్ అనే పరిశోధకురాలు దీనిపై సంవత్సరం పాటు పరిశోధనలు చేశారట. బీర్ లో ప్రో బయాటిక్ అనే బాక్టిరియా ఉంటుందట. ఇది మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. అంతేకాదు.. శరీరంలోని రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందట.
100ఎంఎల్ క్వాంటిటీ గల బీర్ లో ఒక బిలియన్ ప్రో బయాటిక్ బ్యాక్టీరియా ఉంటుందని ఆమె తెలిపారు.
అంతే కాకుండా తలనొప్పి.. వంటివాటిని కూడా తగ్గించేస్తుందట. మద్య పానం అలవాటు లేని వాళ్ల విషయం పక్కన పెడితే.. బీర్ ప్రియులకు మాత్రం ఇది శుభవార్తే.
