ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం బైటపడటంతో పోలీసులు బాలుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి. 

ఆరెకోడు గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలుడు తొమ్మిదో తరగతి వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉండే ఎనిమిదేళ్ల బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఆ బాలుడు తన బాబాయి ఇంట్లో టీవీ చూస్తుండగా ఈ బాలిక కూడా టీవీ చూడడానికి వచ్చింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాలుడు చిన్నారి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావం జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలుడిపై నిర్భయ కేసు పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.