Asianet News TeluguAsianet News Telugu

మ్యాథ్స్, ఫిజిక్స్ పై భయంతో టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

  • కూకట్ పల్లి లో విషాదం
  • చదువులపై భయంతో విద్యార్థిని ఆత్మహత్య
10th class student suicide at kukatpally

చదువుల్లో వెనుబడుతున్నానని మనోవేధనకు గురై ఓ టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో చోటుచేసుకుంది. 10 వ తరగతి
పరీక్షలు దగ్గరపడుతుండటంతో తీవ్ర ఒత్తిడికి గురై ఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. తాను ఎంత ప్రయత్నించినా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులపై పట్టు  సాధిచంలేకపోతున్నానంటూ సూసైడ్ లెటర్ లో రాసిపెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మూసాపేటలోని ఆచార్య వినోభాభావేపురం లో నివసించే అజయ్‌కుమార్‌, ధనలక్ష్మిలకు ప్రభావతి(15) ఏకైక కూతురు. అమ్మాయి ఒక్కతే కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఈ అమ్మాయి స్థానిక సెయింట్‌ రీటా పాఠశాలలో 10 వ తరగతి చదువుతోంది. అయితే ప్రభావతి చదువుల్లో కాస్త వెనుకబడింది. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే చాలా భయం.  10 వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరపడుతుండటంతో ఈ భయం మరీ ఎక్కువైంది. ఈ భయాన్ని, ఒత్తిడిని తట్టుకోలేక ప్రభావతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 


ఆత్మహత్యకు ముందు ఈ విద్యార్థి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios