పరుగు పందెలో ప్రపంచ రికార్డు 40.12 సెకన్లలో 100 మీటర్లు పరుగు 

సాధారణంగా 50 సంవత్సరాలు దాటితే నడవటమే చాలా కష్టంగా ఉంటుంది. కానీ 100 సంవత్సరాలు దాటిన బామ్మ పరుగుపందేంలో ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన జూలియా హవ్కిన్స్ 101 సంవత్సరాల వయస్సులో పరుగు పందేంలో పాల్గోన్నారు. ప్రతి యోడాది అమెరికాలో నిర్వహించే అవుట్ డోర్ మాస్టర్స్ ఛాంఫియన్స్ లీగ్ లో జూలియా పాల్గోన్నారు. ఈ పోటీల్లో 100 మీటర్ల పరుగు ట్రాక్ ను కేవలం 40.12 సెకన్లలో ఆమే పూర్తి చేశారు.

జూలియా హవ్కిన్స్ పూర్తి చేసిన 100 మీటర్ల వంద సంవత్సరాలు పై బడిన వారిలో చాలా పాల్గోన్నది చాలా తక్కువ మంది, ఇప్పటి వరకు 100మీటర్ల రికార్డు 52.22 సెకన్లుతో బోన్లే అనే మహిళ పేరు మీద ఉండేది. ఇప్పుడు 12 సెకన్లు తగ్గించుకొని జూలియా తన ఖాతలో వెసుకుంది. వంద సంవత్సరాలు పై బడిన వారు ఇంట్లో ఆనారోగ్యంతో బెడ్ మీద ఉంటారు అనే మాటను జూలియా బామ్మ మాత్రం మాకు కేవలం వయస్సు మాత్రమే పెరిగింది, కానీ మేము యువత కన్న బాగా పరుగెత్తగలం అని నిరుపించింది.