కొన్ని అలవాట్ల వల్ల కూడా చిత్తవైకల్యం, అల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటుగా మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మీ మానసిక ఆరోగ్యం కోసం మెదడును జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో.. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన శరీరం అన్ని విధులను సమతుల్యంగా ఉంచడానికి మెదడు సహాయపడుతుంది. అందుకే మెదడు ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా మీ మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే కొన్ని అలవాట్లు కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవేంటంటే..
ఆరోగ్యం బాలేనప్పుడు కూడా పనిచేయడం
పని ఎక్కువైతే మెదడుపై ఒత్తిడి ఎక్కువవుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా క్షీణించడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఆరోగ్యం బాలేకున్నా కూడా పనిచేస్తుంటారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే హెల్త్ బాలేనప్పుడు మీ శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి.
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం
ఎక్కువ మొత్తంలో శుద్ధి చేసిన చక్కెరను తీసుకోవడం వల్ల మెదడు, శరీరం ప్రోటీన్, అవసరమైన పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, లెర్నింగ్ డిజార్డర్, హైపర్యాక్టివిటీ, డిప్రెషన్ వంటి ఎన్నో రకాల మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మెదడుతో పాటు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు చక్కెరను తక్కువగా తీసుకోండి.
ధూమపానం
స్మోకింగ్ మన ఆరోగ్యానికి ఎంత డేంజరో మనందరికీ తెలుసు. ఇది ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపడమే కాకుండా మెదడులోని ఎన్నో కణాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. అంతేకాదు చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి ఎన్నో ఇతర మెదడు రుగ్మతలను కలిగిస్తుంది.
మితిమీరిన వినోదం
సంగీతంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా అని పాటలను ఎక్కువగా విన్నా, సోషల్ మీడియాలో చాటింగ్, రోజంతా టీవీ చూడటం ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎక్కువ సేపు వినోద కార్యక్రమాలో పాల్గొనడం వల్ల నిరాశ, ఆందోళన, తక్కువ ఆత్మగౌరవం, ఆలోచనలు చెడు దారిలోకి వెళ్లడం, ఒంటరితనం వంటి మెదడుకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.
చీకటి గదిలో గడపడం
సూర్య కిరణాలకు తగలకుండా ఎక్కువ సేపు చీకటి గదిలో ఉండటం వల్ల మీ శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ హార్మోన్ మీ మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. చీకటి మీ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని అసమతుల్యం చేస్తుంది. మెలటోనిన్ ఒక రకమైన రసాయనం. ఇది మీ నిద్ర విధానాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. చీకట్లో ఎక్కువ సేపు గడపడం వల్ల కూడా మెదడు నిర్మాణం మారే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు నమ్ముతున్నాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి, అభ్యసన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే సూర్యరశ్మిలో కాసేపు గడపండి. స్వచ్ఛమైన గాలికి ఉండండి.
తగినంత నిద్ర లేకపోవడం
మన మొత్తం శరీర ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. కంటినిండా నిద్రపోవడం చాలాచాలా అవసరం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. కంటి నిండా నిద్ర లేకపోవడం మీ జ్ఞాపకశక్తిని తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అలాగే నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. కంటినిండా నిద్రలేకపోవడం వల్ల అల్జీమర్స్, జ్ఞాపకశక్తి వంటి బ్రెయిన్ డిజార్డర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోండి.
