కీరదోసకాయ ఎక్కువగా మనం భోజనం చేసే సమయంలో సలాడ్ రూపంలో కీరదోసకాయను తీసుకుంటాము. ఇలా కీర దోసకాయను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి కీరదోసకాయలు పచ్చిగా తినటం వల్ల ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ఇలా మొట్టమొదటిసారి ఈ కీరదోసకాయను మన ఇండియాలో పండించారు. అనంతరం ఇతర దేశాలకు ఇది వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77% కీరదోస పంటను పండిస్తున్నారు.ఇలా కీర దోసకాయలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కనుక మరి ఈ కీరదోస తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే...
కీర దోసకాయలో అధిక శాతం నీటిని కలిగి ఉంటుంది కనుక ఈ కీరదోస తినటం వల్ల మన శరీరం ఎప్పటికీ డిహైడ్రేషన్ కి గురికాదు. అలాగే మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి కీర దోస ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధక సమస్యను కూడా తొలగిస్తుంది. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది.
ఈ కీర దోసలో విటమిన్ కె విటమిన్ ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ, ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడటంలోనూ సహాయపడుతుంది. కీరదోసలు పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎలాంటి గుండెజబ్బులు రాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.వేసవికాలంలో కీరదోస కాస్త పుదీనా వేసి జ్యూస్ చేసుకుని తాగటం వల్ల ఎండ దెబ్బ నుంచి బయటపడవచ్చు మన శరీరం డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.
కీరదోసలో ఉండే లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయుసోరిసినాల్, అనే లిగ్నన్లు అండాశయ, గర్భాశయ ప్రోస్ట్రేట్ క్యాన్సర్లను నివారించడంలో దోహదపడుతుంది. ఇక ఈ కీరదోస ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా దోహదపడుతుంది.
