Asianet News TeluguAsianet News Telugu

పురుషుల వీర్యంతో సంబంధం లేకుండానే బిడ్డ..!

ఇజ్రాయిల్ దేశానికి చెందిన కొందరు శాస్త్రవెత్తలు.. ఈ రకం ప్రయోగాన్ని చేపట్టారు. కృత్రిమంగా పిండం తయారు చేయడమోలాగో వీరు ఆవిష్కరించారు. ఈ పద్దతిలో పురుషుల వీర్యంతో అసలు సంబంధమే ఉండదు.  

In world first, artificial  fetus grown without the need for a womb, sperm, or egg
Author
Hyderabad, First Published Aug 5, 2022, 9:26 AM IST

ఓ స్త్రీ కడుపు పండాలంటే.. స్త్రీ, పురుషుల కలయిక తప్పనిసరి అనేది ఒకప్పటి మాట. ఒకప్పుడు అందరికీ సాధారణంగా పిల్లలు ఇలానే పుట్టేవారు. కానీ.. మారుతున్న కాలాని తగినట్లు.. సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రకరకాల చికిత్సలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.  కలయికతో సంబంధం లేకుండా.. ఐవీఎఫ్ పద్దతి ద్వారా కూడా చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు అవుతున్నాయి. అయితే.. ఈ పద్దతిలో.. శృంగారంతో సంబంధం లేకపోయినా...  పురుషుల వీర్యం, స్త్రీ అండం తప్పనిసరి. అయితే.. తాజాగా చేసిన ఓ పరిశోధనలో.. అసలు పురుషుల వీర్యం లేకుండా.. పిండాన్ని అభివృద్ధి చేశారు.

నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇజ్రాయిల్ దేశానికి చెందిన కొందరు శాస్త్రవెత్తలు.. ఈ రకం ప్రయోగాన్ని చేపట్టారు. కృత్రిమంగా పిండం తయారు చేయడమోలాగో వీరు ఆవిష్కరించారు. ఈ పద్దతిలో పురుషుల వీర్యంతో అసలు సంబంధమే ఉండదు.  పురుషుల వీర్యంతో ఎలాంటి సంబంధం లేకుండా.. కృత్రిమ పిండాన్ని సృష్టించారు.

మరో విచిత్రం ఏమిటంటే.. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భం కూడా అవసరం లేకపోవడం గమనార్హం. ఓ చిన్న పాత్రలో  ఓ సింథటిక్ పొరను ఏర్పరిచి.. అందలోనే తల్లి గర్భంలోని వాతావరణాన్ని రూపొందించి.. కేవలం రక్త కణాలతోనే ఓ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఇందులోనే కణజాలం వృద్ధి చెందడంతో పాటు.. శరీర భాగాలు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవెత్తలు తెలియజేశారు.

తాము చేసిన ఈ ప్రయోగానికి వీర్య కణాలతో కూడా సంబంధం లేదని చెప్పారు. ఇలా తల్లి గర్భం, తండ్రి వీర్యంతో సంబంధం లేకుండా కృత్రిమ పిండం రూపొందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా... మానవ కణజాలాన్ని, శరీర భాగాలను కృత్రిమ తయారు చేయడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios