మౌత్ అల్సర్స్ తో తినడానికి, తాగడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో ఈ చిట్కాలతో సమస్య తొందరగా తగ్గుతుంది
కొంతమంది తరచూ మౌత్ అల్సర్ సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ నోటి పూత వైరస్లు, బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వస్తుంది. ఏదేమైనా ఈ సమస్య వల్ల దీని వల్ల తినడానికి, తాగడానికి ఎంతో ఇబ్బంది పడతారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
నోటి పూతల సమస్య చాలా మందికి వస్తుంది. ఇది సర్వ సాధారణ సమస్య. పెద్దల నుంచి పిల్లల వరకు ఈ సమస్య ఎవ్వరికైనా రావొచ్చు. కానీ దీని వల్ల తినడానికి, నీటిని తాగడానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు దీనివల్ల బ్రష్ చేసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. నోటి పూతలనే మౌత్ అల్సర్ అంటారు. అయితే ఈ సమస్య వారం రోజుల్లో తగ్గిపోతుంది.
కొంతమందికి నోటిలో బొబ్బలు కూడా అవుతుంటాయి. వైరస్ లు, ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఇందుకు కారణమవుతాయి. అలాగే ఒత్తిడి, జీర్ణ సమస్యలు, ఏవైనా గాయాలు, హార్మోన్ల అసమతుల్యతలు కూడా ఇందుకు కారణమవుతాయి. కాబట్టి మీరు తరచూ నోటి పండ్లతో బాధపడుతుంటే డాక్టర్ దగ్గరకు ఖచ్చితంగా వెళ్లండి. అలాగే కొన్ని సింపుల్ టిప్స్ తో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- నెయ్యితో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం రాత్రిపూట అల్సర్లపై నెయ్యి రాయండి. ఉదయం లేచిన తర్వాత కడిగేయండి. సమాన పరిమాణంలో ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని మిక్స్ చేయండి. దీంతో రోజుకు రెండుసార్లు నోటిని కడగండి.
- లవంగాల నూనె కూడా అల్సర్లను తగ్గిస్తుంది. ఇందుకోసం లవంగాల నూనెను అల్సర్లపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.
- నోట్లో బొబ్బలు ఉన్నప్పుడు పెరుగును తినండి. ఎందుకంటే ఇది మీకు చల్లదనాన్ని కలిగిస్తుంది. అలాగే కడుపు వేడిని కూడా తగ్గిస్తుంది. దీంతో బొబ్బలు త్వరగా నయమవుతాయి.
- టీ ట్రీ ఆయిల్ తో కూడా నోటి పుండ్లను తగ్గించుకోవచ్చు. ఇందుకో టీట్రీ ఆయిల్ లో కాటన్ లో నానబెట్టి బొబ్బలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి.
- అల్సర్లపై తేనెను అప్లై చేస్తే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
- గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలిస్తే కూడా నోటి పూతల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
- పసుపు నీటితో నోటిని కడిగితే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
- అల్లం వాటర్ తో నోటిని కడగడం వల్ల కూడా త్వరగా నోటి పూతలు, బొబ్బలు నయమవుతాయి.
అలాగే..
- తులసి ఆకులు కూడా నోటి పూతను తగ్గిస్తాయి. రోజూ మూడు నాలుగు తులసి ఆకులను నమలడం వల్ల నోటి పూత త్వరగా నయమవుతుంది.
- మీరు రోజూ 10-12 గ్లాసుల నీటిని తాగండి. అలాగే రెగ్యులర్ గ్రీన్ టీ, ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
- పెరుగు, వెన్న, జున్ను వంటి పాల ఉత్పత్తులను తీసుకున్నా ప్రయోజనకరంగా ఉంటుంది.