రాస్ బెర్రీల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఇక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్తపోటును నియంత్రిస్తాయి. 

ఆరోగ్యం అన్ని విధాలా మెరుగ్గా ఉండాలంటే మంచి జీవనశైలి అలవాట్లతో పాటుగా మనం తినే ఆహారం కూడా ఆరోగ్యకరమైందిగా ఉండాలి. ముఖ్యంగా సమతుల్య ఆహారంతో పాటుగా పండ్లను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అరటి, జామ, ఆపిల్, దానిమ్మ వంటి పండ్లను ఎవ్వరైనా తింటారు. మరి రాస్ బెర్రీలను ఎప్పుడైనా తిన్నారా? 

రాస్ బెర్రీలు లేదా కోరిందకాయలు తీయగా ఉంటాయి. ఈ పండ్లు ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ కోరిందకాయలు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కోరిందకాయలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పండ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో కోరిందకాయలను చేర్చడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే? 

 మెదడు శక్తిని పెంచుతాయి

కోరిందకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

కోరిందకాయలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కోరిందకాయలు తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ రెగ్యులర్ డైట్ లో కోరిందకాయలను చేర్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ సమస్యలు రావు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి

రాస్బెర్రీ క్యాన్సర్ ను నివారించడానికి ఉత్తమమైన పండుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కోరిందకాయలలో కనిపించే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ ను కలిగించే కణాలను తొలగిస్తాయి. కోరిందకాయలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.