వెదురు బొంగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిన మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. అలాగే చర్మం అందంగా మెరవడంతో పాటుగా.. 

వెదురులో కూడా మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన బాడీ టెంపరేచర్ ను సరిగ్గా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఈ సీజన్ లో వెదురు బొంగును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

వెదురు బొంగులు కూడా ఆరోగ్యకరమైన ఆహారమే. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. అలాగే దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వెదురు బొంగులను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే.. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది.

వెదురు బొంగుల్లో 4 శాతం వరకు సెల్యులోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగుల పెరిస్టాల్టిక్ కదలికను పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. ఇది ప్రీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది. అంటే ఇవి మన గట్ లోని బెండిసియల్ బ్యాక్టీరియాకు ఇంధనాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

వెదురు బొంగులలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఎల్డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెదురు బొంగులు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో విటమిన్ కె పుష్కలంగా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. 

కొల్లాజెన్ సంశ్లేషణకు సహాయపడుతుంది

దీనిలో సిలికా కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో జింక్, ఇనుము తర్వాత సిలికా మూడో స్థానంలో ఉంటుంది. కొల్లాజెన్, ఎలాస్టిన్ సంశ్లేషణకు అవసరమైన అమైనో ఆమ్లం హైడ్రాక్సీప్రోలిన్ కణజాల స్థాయిలను సిలికా పెంచుతుంది.

ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది

వెదురు బొంగులలో కాల్షియం, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రత, బలాన్ని పెంచుతాయి. వీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలను గ్రహించడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

వెదురు రెబ్బలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ కంటెంట్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఫైబర్ కంటెంట్ నెమ్మదిగా మీ కడుపును ఖాళీ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. ఫలితంగా బరువు తగ్గుతారు.