పుదీనాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో ఉండే మిథనాల్ రీఫ్రెషింగ్ ఫ్లేవర్ ను ఇస్తుంది. అయితే పుదీనాలో తయారుచేసిన టీ ఫ్లేవనాయిడ్లకు గొప్ప మూలం. ఇది కడుపు ఉబ్బరం, జలుబును, బరువును తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
పుదీనా వంటకాలకు మంచి రుచిని ఇవ్వడమే కాదు.. మంచి సువాసను కూడా జోడిస్తుంది. అందుకే దీన్ని ప్రతి వంటలో ఉపయోగిస్తుంటారు. పుదీనాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనితో తయారుచేసిన పుదీనా టీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో నోటిని ఆరోగ్యంగా ఉంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనా టీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పుదీనా సహజమైన తీపిని కలిగి ఉంటుంది. దీనిలో కెఫిన్ కంటెంట్ అసలే ఉండదు. అంతేకాదు దీనిలో పాలను కూడా ఉపయోగించరు. ఈ టీని భోజనం చేసిన తర్వాత తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ టీ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి లేదా కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని పానీయాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. పిప్పరమింట్ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి జీర్ణక్రియకు, మెరుగైన నిద్రకు కూడా సహాయపడుతుంది.
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
ఈ పుదీనా టీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని సేంద్రీయ రకాల టూత్ పేస్ట్ లల్లో ఉపయోగిస్తారు. ఇది నోటి కుహరం, నోటి దుర్వాసనకు దారితీసే బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది. పుదీనా ఆకులను ఖాళీ కడుపుతో నమలడం వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి సైనస్లను తొలగించడానికి సహాయపడుతుంది.
యాంటీ వైరల్
పుదీనా టీలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి జలుబు లేదా ఫ్లూలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాక పుదీనా నాసికా కుహరంలో గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని నిరూపించబడింది. పుదీనాను నీటిలో వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
పుదీనా టీ మనల్ని తాజాగా చేయడానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి బాగా సహాయపడుతుంది. దీనిలో కేలరీలు అసలే ఉండవు. ఫ్యాట్ కూడా ఉండదు. దీనిని తాగితే బరువు పెరిగే ఛాన్స్ యే ఉండదు. ముఖ్యంగా ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ టీని తాగితే రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు కూడా. ఈ టీ మిమ్మల్ని అంటువ్యాధులకు దూరంగా ఉంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పుదీనా టీ ఇ. కోలి, లిస్టీరియా మొదలైన వాటి పెరుగుదలను నియంత్రిస్తుందని చూపించాయి.
కొన్ని పరిశోధనల ప్రకారం.. పుదీనా టీ పీరియడ్ తిమ్మిరిని కూడా బాగా తగ్గిస్తుంది. కడుపు కండరాలు తీవ్రమైన సంకోచం చెందినప్పుడు తిమ్మిరి వస్తుంది. అయితే ఈ తిమ్మిరిని పుదీనా టీ తగ్గిస్తుందని తేలింది. ఇందులో ఉండే రిలాక్సెంట్స్ తిమ్మిరి, నొప్పులను తగ్గిస్తాయి.
