మనం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంటే మన శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం ఎంతో తప్పనిసరి.ఇలా మన శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలి అంటే శరీరానికి తప్పనిసరిగా బీ విటమిన్ ఎంతో అవసరం అవుతుంది. అందుకే మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా విటమిన్ బీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. మన శరీరానికి బీ విటమిన్ లోపం లేకుండా ఉన్నప్పుడే మనం పూర్తి ఆరోగ్యంగా ఉండగలం.
ఇక బీ విటమిన్ ఎనిమిది రకాలుగా ఉంటుంది. ఇందులో బీ1,బీ2, బీ3,బీ 5, బీ 6, బీ7, బీ 9, బీ12 ఇవి నీటిలో కరిగుతాయి. ఇలా బి విటమిన్స్ సక్రమంగా ఉన్నప్పుడు మన శరీరంలో అనేక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. మరి మన శరీరానికి ఈ విటమిన్లు ఎలా దోహదపడతాయో ఇక్కడ తెలుసుకుందాం...
బీ1 థయామిన్: మన శరీరానికి సరైన మోతాదులో శక్తిని ఉత్పత్తి చేయడానికి,గుండె కండరాలు నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలి అంటే తప్పనిసరిగా థయామిన్ విటమిన్ ఎంతో అవసరం. బీ 1 లోపం కారణంగా బరువు కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, గుండె సంబంధ సమస్యలు, కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. మనకు ఈ విటమిన్ ఎక్కువగా సోయాబీన్స్, బ్లాక్ బీన్స్ నైట్స్ బటాని వంటి వాటిలో అధికంగా ఉంటుంది.
బీ 2 రైబోఫ్లావిన్: శక్తి ఉత్పత్తి చేయడానికి కార్బోహైడ్రేట్లో, కొవ్వులు ప్రోటీన్ల జీవక్రియలు కీలకపాత్ర పోషిస్తుంది.ఈ విటమిన్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ విటమిన్ లోపం కారణంగా ఎనీమియాకు దారి తీయవచ్చు. ఇక బి 2 విటమిన్ ఎక్కువగా పుట్టగొడుగులు ఆకుకూరలు బాదంపప్పు మజ్జిగ వంటి ఆహార పదార్థాలలో లభిస్తుంది.
బీ 3 నియాసిన్: ఈ విటమిన్ డిఎన్ఏ సింథసిస్ నాడి వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా పప్పు ధాన్యాలు,వేరుశనగలు బ్రౌన్ రైస్ అవకాడో వాటి ఆహార పదార్థాలలో అధికంగా లభిస్తుంది. ఇక నియాసిన్ విటమిన్ లోపం కారణంగా నాలుక ఎర్రగా మారడం తలనొప్పి నీరసం వికారం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
బీ 5 పాంటోథెనిక్ యాసిడ్: శక్తి ఉత్పత్తి, హార్మోన్ సంశ్లేషణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా ప్రొద్దుతిరుగుడు విత్తనాలు బ్రోకలీ, అవకాడో సెనగలు వేరుసెనగలు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ కనుక లోపిస్తే కాళ్లు చేతులు మంటలు తిమ్మిర్లు ఏర్పడటం నిద్రలేమి సమస్య వంటి లక్షణాలు తలెత్తుతాయి.
బీ6 పిరిడాక్సిన్: ఈ విటమిన్ మన శరీరంలోఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే నాడీ ఉత్పత్తిలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇక శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఈ విటమిన్ ఎంతగానో దోహదం చేస్తుంది. శనగలు, బంగాళా దుంపలు, పాలకూర, సోయా బీన్స్, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, అల్లం వంటి ఆహార పదార్థాలలో అధికంగా దొరుకుతుంది. ఎనీమియా, పెదవులు పగలడం, నాలుక వాపు, ఇమ్యూన్ సిస్టం బలహీన పడడం, వంటి సమస్యలు తలెత్తుతాయి.
బీ7 బయోటిన్:మన శరీరంలో ఆరోగ్యకరమైన జుట్టు గోర్లు పెరుగుదలకు బయోటిన్ విటమిన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా మనకు అవకాడో అరటి పుట్టగొడుగులు క్యాలీఫ్లవర్ పాలు వంటి ఆహార పదార్థాలలో అధికంగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం కారణంగా జుట్టు రాలిపోవడం గోర్లు పెలుసుగా తయారవడం డిప్రెషన్ నీరసం వంటివి తలెత్తుతాయి.
బీ9 ఫోలిక్ యాసిడ్: డీఎన్‌ఏ సింథెసిస్‌తోపాటు కణ విభజన, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎంతగానో దోహదపడతాయి. అయితే ఫోలిక్ యాసిడ్ శరీరంలో తగ్గినప్పుడు తలనొప్పి, నీరసం, చిరాకు, నోటి పుండు రావడం జరుగుతుంది. పోలిక్ యాసిడ్ ఎక్కువగా అవకాడో, బొప్పాయి, ఆరెంజ్ జ్యూస్, బీన్స్, నట్స్, సోయా బీన్స్, రాజ్మా వంటి వాటిలో పుష్కలంగా లభిస్తుంది.
బీ 12 కోబాలమిన్: ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, డీఎన్‌ఏ సింథెసిస్, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో కోబాలమిన్ ఎంతగానో దోహదపడుతుంది.విటమిన్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తయ్యేలా చేస్తుంది.ఈ విటమిన్ లోపం కారణంగా కాళ్లు చేతులు తిమ్మర్లెక్కడం ఆకలి లేకపోవడం మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి అయితే ఈ విటమిన్ పుష్కలంగా లభించాలి అంటే పాలు, మజ్జిగ, పెరుగు, పన్నీర్, ఛీజ్, బటర్, న్యూట్రిషనల్ యీస్ట్ వంటి పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
