మంగళగిరి: స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడంతో ఘోరంగా విఫలమయ్యాడని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇందుకు భాద్యత వహిస్తూ వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రజల సమస్యలను గాలికొదిలేసి కేవలం కక్షసాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని మండిపడ్డారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి వేరుపడిన తర్వాత లోటు బడ్జెట్ లో వున్న రాష్ట్రం కూడ చంద్రబాబు నాయకత్వంలో అబివృద్ది వైపు అడుగులు వేసిందన్నారు. కష్టకాలంలో కూడా నిరుపేదలు, నిరాశ్రయుల పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 

కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడిన తర్వాత కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీని మరిచి రూ.2250 ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో  వైఎస్సార్‌సిపి  రూ.3వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. 

read more   కారు ఏర్పాటు చేస్తే అమరావతిలో తిరుగుదాం: బొత్సకు అచ్చెన్న సవాల్

టిడిపి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేవని ఈ సందర్భంగా లోకేశ్ పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు మూసి వేసి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. గ్రామాల్లో డెంగ్యూ జ్వరాల వలన రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2500 మంది చనిపోయారని... ఈ మరణాలు ఆపడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. 

ఇసుక కొరత మూలంగా నిర్మాణాలు పూర్తిగా నిలిచి పోయి కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక, తినటానికి తిండి లేక,పిల్లల స్కూలు ఫీజులు కట్టుకోటానికి డబ్బులు లేక వివిధ సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గ్రామ వాలంటరీల వలన రాష్ట్రానికి 4 వేల కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. గ్రామాల్లో నియమించిన ఈ వాలంటరీ వ్యవస్థ ఘోరంగా విఫలమైందన్నారు. ఇది కేవలం వైసిపి  కార్యకర్తలకు ఉపాధి కల్పించడానికే చేపట్టారని ఆరోపించారు. 

read more  ఇసుక కొరత: తెనాలిలో మరో భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య

గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకు అండగా వుండేలా లీగల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ ఎన్నికలు త్వరలోనే జరుపుతామన్నారు. నియోజకవర్గ కార్యకర్తల కోసం ఎప్పుడు తమ ఇంటి తలపులు తెరిచే ఉంటాయని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాదు ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నానని లోకేశ్ మంగళగిరి ప్రజలకు, టిడిపి కార్యకర్తలకు హామీ హామీ ఇచ్చారు.