మొక్కలు ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మరి ఇంటి అలంకరణ కోసం ఏ సక్యూలెంట్ మొక్కలు బాగుంటాయో మీకు తెలుసా? ఆలస్యమెందుకు పదండి తెలుసుకుందాం.
పండగలు, పూజలు మహిళలకు చాలా ప్రత్యేకం. ఈ సమయంలో మనసులో పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, మనలో శక్తి కూడా పెరుగుతుంది. పండగ వేళ ఇంటి వాతావరణాన్ని మరింత పాజిటివ్‌గా మార్చడానికి సక్యూలెంట్ మొక్కలతో అలంకరించవచ్చు. సక్యూలెంట్ మొక్కల ఆకులు ఉబ్బినట్టు, మెత్తగా ఉంటాయి. మరి ఈ మొక్కలతో ఇంటిని ఎలా అందంగా మార్చుకోవచ్చో ఇక్కడ చూద్దాం.
డెకరేటివ్ పాట్స్, ప్లాంటర్స్

సాదా కుండీలకు బదులుగా సిరామిక్, టెర్రకోట లేదా జామెట్రిక్ డిజైన్లు ఉన్న ప్లాంటర్లు వాడండి. తెలుపు, లేత రంగుల కుండీల్లో సక్యూలెంట్ మొక్కలు చాలా క్లాసీగా కనిపిస్తాయి. వీటిని బాల్కనీ దగ్గర పెట్టొచ్చు.
మొక్కల కింద గులకరాళ్లు

కుండీలో లేదా బాల్కనీలో మట్టిపైన తెలుపు, నలుపు లేదా రకరకాల రంగుల గులకరాళ్లు పెట్టండి. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటికి మంచి అందాన్నిస్తాయి.
అరోమా క్యాండిల్స్ వాడకం
మార్కెట్లో రకరకాల సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ సులభంగా దొరుకుతాయి. వాటిని సక్యూలెంట్ మొక్కల చుట్టూ అలంకరించండి. ఇవి ఇంట్లో వెలుగును పెంచడమే కాకుండా, వాతావరణాన్ని సువాసనభరితంగా మారుస్తాయి.
చిన్న చిన్న షోపీస్‌లు
చిన్న బుద్ధుడి విగ్రహాలు, జంతువుల బొమ్మలు లేదా అబ్‌స్ట్రాక్ట్ షోపీస్‌లను సక్యూలెంట్ మొక్కల పక్కన పెట్టొచ్చు. ఇంట్లో ఎక్కువ స్థలం ఉంటే, చిన్న వాటికి బదులు కొంచెం పెద్ద షోపీస్‌లు కొని ఇంటిని అలంకరించుకోవచ్చు.
ఫెయిరీ లైట్లతో పాజిటివ్ వైబ్స్
ఫెయిరీ లైట్లతో సక్యూలెంట్ మొక్కల అందం రెట్టింపు అవుతుంది. సాయంత్రం పూట ఇంటికి సాఫ్ట్ గ్లో వస్తుంది. పెద్దగా అలంకరణ చేయకపోయినా ఇల్లు మెరిసిపోతుంది.
వాల్ ఆర్ట్ లేదా ఫోటో ఫ్రేమ్
మొక్క వెనుక చిన్న ఫ్రేమ్ లేదా ఆర్ట్‌వర్క్ పెట్టి ఆ కార్నర్‌ను అందంగా మార్చొచ్చు. కావాలంటే వాల్ స్టిక్కర్లను కూడా వాడుకోవచ్చు. ఇవి ఆన్‌లైన్‌లో సులభంగా దొరుకుతాయి.
ఇంటి లోపల ఏ సక్యూలెంట్ మొక్కలు పెట్టుకోవాలి?
కలబంద : ఇది చాలా పాపులర్ సక్యూలెంట్. తక్కువ నీటితో కూడా సులభంగా పెరుగుతుంది.
జెడ్ ప్లాంట్ : చిన్నగా, లావుగా ఉండే దీని ఆకులు చాలా క్యూట్‌గా, డెకరేటివ్‌గా కనిపిస్తాయి.
ఎచెవేరియా: గులాబీ పువ్వులా కనిపించే ఈ మొక్కను ఇండోర్ డెకరేషన్ కోసం ఎంచుకోవచ్చు.
హవోర్థియా : చిన్నగా, కాంపాక్ట్‌గా ఉండే ఈ మొక్క టేబుల్స్ లేదా షెల్ఫ్‌ల మీద పెట్టడానికి బెస్ట్.


