MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Gold: 916 బంగారానికీ, 21 క్యారెట్ల బంగారానికీ తేడా ఏంటి?

Gold: 916 బంగారానికీ, 21 క్యారెట్ల బంగారానికీ తేడా ఏంటి?

బంగారు ఆభరణాల విషయానికి వస్తే, ఎక్కువగా 916 , 22 క్యారెట్ల పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. మరి, ఈ రెండూ ఒకటేనా? రెండింటికీ తేడా ఏంటి? బంగారం స్వచ్ఛత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 25 2025, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Gold Price

Gold Price

అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన జరుపుకోనున్నాం. అసలు.. అక్షయ తృతీయ అనగానే కనీసం ఒక్క గ్రాము అయినా బంగారం కొనాలి అని చాలా మంది తహతహలాడుతూ ఉంటారు.అలా కొంటే శుభప్రదం అని భావిస్తారు. అందుకే.. ఈ అక్షయ తృతీయ సమీపిస్తున్న కొద్దీ బంగారం ధర కూడా బాగా పెరుగుతుంది. ఈ ఏడాది బంగారం ధర మరీ దారుణంగా పెరిగిపోతోంది.దాదాపు తులం పసిడి ధర రూ.లక్షకు చేరువైంది.  అమెరికా, చైనా మధ్య వాణిజ్య వైరం కారణంగా ఈ పసిడి ధర పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ధర ఎంత పెరిగినా, అసవరానికి ఆభరణాలు కొనక తప్పదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బంగారు ఆభరణాల విషయానికి వస్తే, ఎక్కువగా 916 , 22 క్యారెట్ల పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. మరి, ఈ రెండూ ఒకటేనా? రెండింటికీ తేడా ఏంటి? బంగారం స్వచ్ఛత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

35

బంగారం స్వచ్ఛత విషయానికి వస్తే, ప్రజలు 24 క్యారెట్లను ఎక్కువగా నమ్ముతారు.కానీ, బంగారం ఆభరణాలు మాత్రంర 22 క్యారెట్లలో మాత్రమే అమ్ముతారు. మరి, 916 అంటే ఏంటి? అనే సందేహం మీకు రావచ్చు. 916 క్యారెట్ల బంగారాన్ని బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. ఇక్కడ 916 అంటే బంగారం 91.6 శాతం స్వచ్ఛమైనది.మిగిలిన 8.4 శాతం రాగి, వెండి లేదా ఇతర లోహాల మిశ్రమం కావచ్చు. ఈ మిశ్రమం బంగారాన్ని బలోపేతం చేస్తుంది.దానిని ఆభరణాలుగా అచ్చు వేయడం సులభతరం చేస్తుంది. 916 క్యారెట్ల బంగారం 22 క్యారెట్ల బంగారంతో సమానంగా పరిగణిస్తారు.

45
Gold Silver Jewllry

Gold Silver Jewllry

24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛతను కలిగి ఉంటుంది, కానీ అది చాలా మృదువైనది.అచ్చంగా బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు. అందుకే.. దాంట్లో రాగి, వెండి లాంటివి కలుపుతారు. అప్పుడు అది 22 క్యారెట్ లేదంటే 916 గోల్డ్ గా పరిగణిస్తారు. మనం కొనే బంగారం స్వచ్ఛమైనది అని చెప్పడానికి దానిపై 916 అని హాల్ మార్క్ వేస్తారు.

55

916 బంగారం,22k బంగారం మధ్య తేడా ఏమిటి? 
916 బంగారం, 22 క్యారెట్లు వేర్వేరు అని మీరు అనుకుంటే, మీరు పొరబడినట్లే. ఎందుకంటే 916 బంగారం, 22 క్యారెట్లు ఒకటే. రెండింటిలోనూ 91.6 శాతం బంగారం,  8.4 శాతం ఇతర లోహాల మిశ్రమం ఉంటుంది. ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా పిలుస్తారు. 

KDM బంగారం అంటే ఏమిటి? 
KDM బంగారాన్ని కాడ్మియం బంగారం అని కూడా అంటారు. ఇది కాడ్మియం అనే విషపూరిత లోహాన్ని కలిగి ఉన్న ఒక రకమైన బంగారు మిశ్రమ లోహం. ఇది ఆభరణాలను బలంగా , మెరిసేలా చేస్తుంది. కానీ, ఇది పర్యావరణానికి , ఆభరణాలను తయారు చేసే చేతివృత్తులవారికి ఆరోగ్య సంబంధిత సమస్యలను సృష్టిస్తుంది. అందుకే BIS ఇప్పుడు దీనిని నిషేధించింది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం
జీవనశైలి
మహిళలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved