Hair Growth: రోజ్మేరీ వాటర్ వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా?
Hair Growth: రోజ్మేరీలో తలను రిఫ్రెష్ చేసే, జుట్టు మూలాలను బలోపేతం చేసే అనేక సహజ పదార్థాలు ఉన్నాయి. చాలా మంది దీనిని హెయిర్ స్ప్రే,హెయిర్ రిన్స్ గా ఉపయోగిస్తారు. దీని ద్వారా జుట్టుకు అవసరం అయిన పోషకాలు అన్నీ లభిస్తాయి.

Hair Growth
ప్రస్తుత కాలంలో, సరైన ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన జీవన శైలి, కాలుష్యం మన ఆరోగ్యంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. వీటి కారణంగానే హెయిర్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది తాము వాడుతున్న నూనె, షాంపూ, కండిషనర్లు మారుస్తూ ఉంటారు. అయితే, అవేమీ లేకుండా... కేవలం రేజ్మేరీ వాటర్ వాడితే చాలు.
రోజ్మేరీ వాటర్ జుట్టును ఎలా పెంచుతుంది..?
రోజ్మేరీ లో కార్సినిక్ ఆమ్లం, రోజ్మరినిక్ యాసిడ్ ఉంటాయి. ఈ రోజ్మేరీ వాటర్ ని తల, జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. జుట్టు పలచగా ఉన్న ప్రదేశంలో ఈ రోజ్మేరీ వాటర్ స్ప్రే చేసి నెమ్మదిగా మీ మునివేళ్ళతో మసాజ్ చేస్తే చాలు. చాలా కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా పెరగడం మొదలౌతుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది...
అదనంగా, రోజ్మేరీలోని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. సహజంగా ఒత్తిడి కారణంగానే ఎక్కువగా జుట్టు రాలుతూ ఉంటుంది. ఈ రోజ్మేరీ వాటర్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ లో ఉంటుంది.
రోజ్మేరీ నీటిని ఎలా ఉపయోగించాలి?
రోజ్మేరీ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపండి. జుట్టు మూలాలపై నేరుగా స్ప్రే చేయండి. తర్వాత బాగా మసాజ్ చేయాలి. దీనిని రాసిన తర్వాత స్పెషల్ గా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి, మీరు ప్రతిరోజూ కూడా దీనిని వాడొచ్చు. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల... కొద్ది రోజులకే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
రోజ్మేరీ వాటర్ తయారు చేసే విధానం....
రోజ్మేరీ ఎండిపోయిన ఆకులతో మనం రోజ్మేరీ వాటర్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా... ఒక పాత్రలో ఒక కప్పు నీరు తీసుకొని మరిగించాలి. ఆ నీరు మరుగుతున్నప్పుడు... అందులో రేజ్మేరీ ఆకులు కూడా జోడించాలి. కనీసం పది నిమిషాల పాటు ఆ నీటిని మరిగించాలి. తర్వాత వడబోసి.. నీరు చల్లారే వరకు పక్కన పెట్టాలి. తర్వాత.. ఈ నీటిని ఏదైనా స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసి... జుట్టుకు బాగా పట్టించాలి. ప్రతిరోజూ వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి

