Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క నూనె రాసినా..అందం రెట్టింపు అవ్వడం ఖాయం
తక్కువ ఖర్చుతో అందాన్ని పెంచుకోవడానికి మీరు బాదం నూనె వాడితే చాలు. రాత్రి పడుకునే ముందు ఈ బాదం నూనె ముఖానికి రాస్తే చాలు.ఈ బాదం నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ముఖంలో గ్లో పెరగాలంటే..
వయసు పెరుగుతున్నా కూడా ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా..ఫేస్ క్లియర్ గా, గ్లో గా ఉంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి కల చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది. కానీ.. ఇలాంటి అందం కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అది మన వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ, అత్యంత తక్కువ బడ్జెట్ లో కూడా మీ అందాన్ని పెంచుకోవచ్చు.
తక్కువు ఖర్చుతో..
తక్కువ ఖర్చుతో అందాన్ని పెంచుకోవడానికి మీరు బాదం నూనె వాడితే చాలు. రాత్రి పడుకునే ముందు ఈ బాదం నూనె ముఖానికి రాస్తే చాలు.ఈ బాదం నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట రాయడం వల్ల చర్మం మెరుస్తూ కనపడుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
చర్మానికి తేమ...
బాదం నూనెలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం తేమను ఎక్కువ కాలం నిలుపుకోవడంలో సహాయపడతాయి. రాత్రిపూట ఈ నూనె రోజూ రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మెరిసేలా కనపడటానికి సహాయపడుతుంది.
యవ్వనంగా కనిపించడం:
వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై కనిపించే గీతలు, ముడతలను తగ్గించడానికి బాదం నూనె ఒక అద్భుతమైన పరిష్కారం. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఉపయోగించినప్పుడు, ముఖంలోకి లోతుగా చొచ్చుకుపోయి, ముఖంలో ముడతలు తగ్గిపోవడానికి సహాయపడతాయి.
మొటిమలు, బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:
బాదం నూనె యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ , డార్క్ స్పాట్‌లను నివారించడంలో సహాయపడుతుంది. ఈ నూనెను రాత్రిపూట ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం పై పేరుకున్న మురికి తొలగించి.. బ్లాక్ హెడ్స్ తగ్గిపోయేలా చేస్తుంది. మొటిమల సమస్య కూడా ఉండదు.
చర్మ కాంతిని పెంచుతుంది:
బాదం నూనెలోని పోషకాలు చర్మం సహజ కాంతిని పునరుద్ధరిస్తాయి. ఈ నూనె రాత్రంతా చర్మంలోకి చొచ్చుకుపోతుంది, చర్మంలోని కణాలను పునరుద్ధరిస్తుంది. ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. వారానికి 2 లేదా 3 సార్లు ముఖంపై బాదం నూనెను పూయడం వల్ల చర్మం మెరిసేలా చేస్తుంది.
కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది:
కళ్ల కింద కొద్ది మొత్తంలో బాదం నూనెను పూయడం, మీ చేతులతో మసాజ్ చేయడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు, ఉబ్బరం తగ్గుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కంటి ప్రాంతంలోకి చొచ్చుకుపోతుంది. దీని వల్ల మీ ముఖం అందంగా కనపడుతుంది.