MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Soap: ఫ్యామిలీ అంతా ఒకే సబ్బు వాడుతున్నారా? వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Soap: ఫ్యామిలీ అంతా ఒకే సబ్బు వాడుతున్నారా? వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Soap: మీ ఫ్యామిలీ మొత్తం ఒకే సబ్బు వాడుతున్నారా? ఒక్కొక్కరు ఒక్కో సబ్బు వాడుతున్నారా? అసలు.. ఒకే సబ్బు కుటుంబం మొత్తం వాడొచ్చా? అలా వాడితే ఏమైనా సమస్యలు వస్తాయా? 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Apr 21 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
soap
Image Credit : Gemini AI

soap

మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. వ్యక్తిగత శుభ్రతలో భాగంగా ప్రతిరోజూ స్నానం చేయడం చాలా ముఖ్యం. దీనిలో భాగంగానే మనం సబ్బు వాడుతూ ఉంటాం. దాదాపు, అందరు ఇళ్ల్లో కుటుంబం మొత్తం ఒకే సబ్బు వాడుతూ ఉంటారు. కానీ ఫ్యామిలీ మొత్తం ఒకే సబ్బు వాడటం కరెక్టేనా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒకే సబ్బు వాడితే ఇన్ఫెక్షన్లు వస్తాయా?
Image Credit : Gemini AI

ఒకే సబ్బు వాడితే ఇన్ఫెక్షన్లు వస్తాయా?

సాధారణ పరిస్థితుల్లో ఒకే సబ్బు వాడటం వల్ల పెద్దగా సమస్యలు రావు. సబ్బులో ఉండే రసాయనాలు చాలా వరకు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అయితే.. కుటుంబంలో ఎవరికైనా గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడు అదే సబ్బును ఇతరులు వాడటం ప్రమాదకరం. సబ్బు తడిగా ఉండే సమయంలో దానిపై సూక్ష్మ క్రిములు కొంతసేపు జీవించి ఉండే అవకాశం ఉంటుంది.

33
ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలా ఉంటుంది...
Image Credit : Getty

ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలా ఉంటుంది...

జిడ్డు చర్మం ఉన్నవారికి ఆయిల్ ను నియంత్రించే సబ్బులు అవసరం.

పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్న సబ్బులు వాడాలి.

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కెమికల్స్ తక్కువగా ఉన్న మైల్డ్ సబ్బులు మాత్రమే వాడాలి.

పిల్లల చర్మం చాలా నాజూకుగా ఉంటుంది. పెద్దల సబ్బులు పిల్లలకు వాడితే స్కిన్ రఫ్ గా మారి రాషెస్, అలర్జీలు కలిగించే ప్రమాదం ఉంటుంది. అందుకే కుటుంబంలో అందరూ ఒకే సబ్బు వాడకూడదు.

సబ్బు కి బదులు ఏం వాడాలి...?

చర్మ నిపుణులు ప్రకారం, ఒకే వస్తువును వాడాలి అనుకుంటే సబ్బు కంటే లిక్విడ్ బాడీ వాష్ లేదా షవర్ జెల్ వాడొచ్చు. దీని వల్ల స్కిన్ సమస్యలు రావు. అందుకే సబ్బుకు బదులు.. బాడీ వాష్ వాడటం ఉత్తమం..

సబ్బు వాడేటప్పుడు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు...

వీలైతే ప్రతి ఒక్కరూ తమ సబ్బును వేరుగా ఉంచుకోవాలి. వాడిన తర్వాత ఎండగా ఉంచితే క్రిముల పెరుగుదల తగ్గుతుంది. సబ్బు పెట్టే డబ్బాను కూడా తరచుగా శుభ్రం చేయాలి. ఇక.. ఏదైనా చర్మ సమస్యలు ఉన్నవారు, ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ఒకరి సబ్బును మరొకరు వాడకూడదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు మాత్రం స్పెషల్ సబ్బులు వాడాలి. ఒకే సబ్బు వాడటం వల్ల వెంటనే సమస్యలు రాకపోయినా, దీర్ఘకాలంలో చర్మ సమస్యలు పెరగవచ్చు.కుటుంబంలో ఎవరికైనా అలర్జీలు ఉంటే, వారి కోసం ప్రత్యేక సబ్బు తప్పనిసరి.

ఒకే సబ్బు వాడటం పూర్తిగా ప్రమాదకరం కాదు కానీ, అది ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోతుందనే గ్యారెంటీ లేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సబ్బు ఎంపిక చేసుకోవడం ఉత్తమ మార్గం. ముఖ్యంగా పిల్లలు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి విడివిడిగా సబ్బులు వాడటం చాలా మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Dosa Mix: ఇదొక్క పొడి రెడీ చేసుకుంటే.. పప్పు రుబ్బేపని లేకుండా క్రిస్పీ , టేస్టీ దోశలు రెడీ
Recommended image2
Milk: ఈ పొడి చిటికెడు వేస్తే.. పాలు రెండు, మూడురోజులైనా విరిగిపోవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved