పెళ్లైన స్త్రీలు.. కాలికి మెట్టెలు ఎందుకు ధరిస్తారు..!
ఇక చాలా మంది సాంప్రదాయంలో భర్తే స్వయంగా ఆ పెళ్లి కొత్త పెళ్లి కూతురు కాళ్లకు వెండి మెట్టలను తొడుగుతాడు. కొందరికీ మేన మామ భార్య.. మెట్టెలను తొడుగుతుంది.
toe ring
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళలు కాలికి మెట్టెలు ధరించడం చాలా సర్వ సాధారణం. అయితే... అసలు మహిళలు పెళ్లైన తర్వాత.. కాలికి మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దాని వెనక ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి వెనక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో ఓసారి చూద్దాం..
పెళ్లికి ముందు వరకు ధరించరు. కానీ.. పెళ్లి నాటి నుంచి వీటిని ధరించడం మొదలుపెడతారు. అది కూడా కేవలం వెండితో తయారు చేసిన రింగ్స్ ని మాత్రమే ధరిస్తారు.
toe-ring
ఇలా కాలి మెట్టెలు ధరించడం వెనక పురాణాల్లో చాలా కథలే ఉన్నాయట. రామాయణంలో సీతను రావణాసురుడు ఎత్తుకు వెళ్లినప్పుడు.. ఆమె తనను రాముడు గుర్తించాలని తన కాలి మెట్టెలను పడేసిందట. వాటి ఆధారంగా.. సీతను ఎవరో ఎత్తుకువెళ్లారు అనే విషయాన్ని రాముడు గుర్తించాడట
ఇక చాలా మంది సాంప్రదాయంలో భర్తే స్వయంగా ఆ పెళ్లి కొత్త పెళ్లి కూతురు కాళ్లకు వెండి మెట్టలను తొడుగుతాడు. కొందరికీ మేన మామ భార్య.. మెట్టెలను తొడుగుతుంది.
ఆ మెట్టలను కాలికి తొడగడం వల్ల మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుందట. దీనికి సైంటిఫిక్ రీజన్ ఉందట. కాలికి మెట్టలు ధరించడం వల్ల మహిళలకు గైనిక్ సమస్యలు రాకుండా ఉాంటాయట. ఆ వెండి మెట్టలు కాలి వేళ్లకు తగులుతూ ఉంటే.. వారి గైనిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందట.
అంతేకాదు.. కాలి వేలికి మెట్టెలు ధరించి నడుస్తూ ఉండటం వల్ల.. అవి నరాలకు సరిగా తగులుతాయట. దాని వల్ల బాడీ సిస్టమ్.. బ్యాలెన్స్డ్ గా ఉంటుందట. ముఖ్యంగా మహిళలల్లో రీ ప్రొడక్టివ్ సిస్టమ్ సరిగా పని చేస్తుందట. అందుకే పెళ్లి తర్వాత మహిళలు వీటిని ధరించాలని చెబుతూ ఉంటారు.
అంతేకాకుండా మహిళలు ఈ వెండి రింగులు ధరించడం వల్ల.. వారికి గర్భం దాల్చే అవకాశం పెరుగుతుందట. వారికి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి కూడా కారణమౌతాయి.
ఇక ఇప్పుడు ఈ మెట్టెలు ధరించడం కూడా ఒకరకమైన ఫ్యాషన్ గా మారిపోయింది. దీనిలో చాలా విభిన్న రకాల మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ట్రెండీ మోడల్స్ ని మహిళలు ధరిస్తున్నారు.