MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Period Delay Pills: పీరియడ్స్ ఆలస్యం చేసే ట్యాబ్లెట్ ఇంత ప్రమాదమా? ప్రాణాలు తీస్తుందా?

Period Delay Pills: పీరియడ్స్ ఆలస్యం చేసే ట్యాబ్లెట్ ఇంత ప్రమాదమా? ప్రాణాలు తీస్తుందా?

Period Delay Pills: ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది అంటే చాలు.. ఎక్కడ అడ్డు వస్తుందో అని చాలా మంది పీరియడ్స్ ఆలస్యం కావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ, ఇప్పుడు ఈ ట్యాబ్లెటే ఓ యువతి ప్రాణాలు తీసింది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 15 2026, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీరియడ్స్ ఆలస్యం అవ్వాలని ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా?
Image Credit : our own

పీరియడ్స్ ఆలస్యం అవ్వాలని ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా?

మహిళలను పీరియడ్స్ ప్రతి నెలా పలకరిస్తూ ఉంటాయి. అయితే, మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్ ని ఒక అంటరానిదానిగా చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు.  ముఖ్యంగా పూజలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు లాంటి వాటికి పీరియడ్స్ వచ్చిన వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. బయట వాటికైతే దూరంగానే ఉంటాం. కానీ.. ఇంట్లో ఫంక్షన్ అయితే అలా దూరంగా ఉండలేక.. ఆ పీరియడ్స్ ఆలస్యం కావడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. ఏ మెడికల్ షాప్ కి వెళ్లినా ఈజీగా దొరికే ఈ ట్యాబ్లెట్ ఇటీవల ఓ యువతి ప్రాణం తీసింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైద్యులు ఏమంటున్నారు?
Image Credit : Getty

వైద్యులు ఏమంటున్నారు?

యువతి చనిపోయిన ఘటన అందరినీ షాకింగ్ గురి చేసింది. పదిలో ఆరుగురు పీరియడ్స్ ఆగడానికి ఎప్పుడో ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నవారే. అలాంటి ట్యాబ్లెట్ ఓ యువతి ప్రాణాలు నిమిషాల్లో గాల్లో కలిసిపోయేట్లు చేసింది. ఈ ఘటన తర్వాత.. వైద్యులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇదే విషయంపై బెంగళూరుకు చెందిన డాక్టర్ వివేకానంద్ మాట్లాడారు. 

ఇలాంటి మందులు వాడటం ల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి (థ్రాంబోసిస్) చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. సదరు యువతి కూడా..ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో పీరియడ్స్ వాయిదా వేయడానికి మాత్రలు వేసుకుంది. కొద్దిసేపటికే ఆమెకు తీవ్రమైన కాలు నొప్పి, వాపు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో ఒకచోట రక్తం గడ్డకట్టి, అది నేరుగా ఊపిరితిత్తులకు లేదా మెదడుకు చేరి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీనివల్ల మరణం సంభవిస్తుందని డాక్టర్ వివరించారు.

35
ఈ ట్యాబ్లెట్స్ అంత ప్రమాదమా?
Image Credit : Chat gpt

ఈ ట్యాబ్లెట్స్ అంత ప్రమాదమా?

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో గైనకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీలం సూరి కూడా మహిళలను హెచ్చరిస్తున్నారు. 'పీరియడ్స్ వాయిదా వేసే హార్మోన్ల మందులు విరివిగా దొరుకుతున్నాయి. పరీక్షలు, పెళ్లిళ్లు, ప్రయాణాలు లేదా పెద్ద ఫంక్షన్ల ముందు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ మాత్రలు సౌకర్యంగా అనిపించినా, వాటితో ప్రమాదం లేదని కాదు. కొన్ని సందర్భాల్లో ఇవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (వీనస్ థ్రాంబోసిస్) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి' అని  అన్నారు.

45
అసలు ఈ మందులు ఎలా పని చేస్తాయి?
Image Credit : Getty

అసలు ఈ మందులు ఎలా పని చేస్తాయి?

అసలు ఈ మాత్రలు ఎలా పనిచేస్తాయో తెలిస్తే, వాటి తీవ్రత కూడా అర్థమవుతుంది. పీరియడ్స్ వాయిదా వేయడానికి వాడే చాలా మాత్రలలో సింథటిక్ హార్మోన్లు ఉంటాయి. ప్రొజెస్టిరాన్ లేదా ఈస్ట్రోజెన్‌తో కలిపి ఇవి ఉంటాయి. ఇవి శరీరంలో ప్రొజెస్టిరాన్ స్థాయిలను కృత్రిమంగా పెంచి ఉంచుతాయి. దీనివల్ల గర్భాశయ పొర విచ్ఛిన్నం కాకుండా, పీరియడ్స్ రాకుండా ఆగిపోతాయి. పీరియడ్స్ రావాల్సిన కొన్ని రోజుల ముందు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల, ప్రొజెస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండి రక్తస్రావం ఆగిపోతుంది.
55
ఈ మందులు వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
Image Credit : Getty

ఈ మందులు వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

ఈ హార్మోన్ల మాత్రల వల్ల వచ్చే ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్.. రక్తంపై వాటి ప్రభావమే. ఇవి రక్తం గడ్డకట్టే స్వభావాన్ని పెంచుతాయి. రక్తాన్ని చిక్కగా మార్చి, రక్తనాళాల లోపల గడ్డకట్టేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో ఈ ప్రమాదం తక్కువే. కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి లేదా కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి చరిత్ర ఉన్నవారికి ఈ మాత్రలు చాలా ప్రమాదకరం.

ఈ మాత్రలు వేసుకున్న వాళ్లంతా చనిపోతారని కాదు. అందరికీ ప్రమాదం ఒకేలా ఉండదు. ఊబకాయం, వ్యాయామం లేని జీవనశైలి, ధూమపానం, నియంత్రణలో లేని డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మాత్రలు చాలా ప్రమాదకరం. కుటుంబంలో ఎవరికైనా రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా రిస్క్ ఎక్కువే. అందుకే… ఎలాంటి మందులు అయినా డాక్టర్స్ సలహా తీసుకున్న తర్వాతే వాడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Period Talk: మహిళలు పీరియడ్స్ లో అస్సలు చేయకూడనివి ఇవే..!
Recommended image2
Ripen Raw Mangoes:రసాయనాలు లేకుండా ఇంట్లో లేకుండా మామిడి పండ్లు మగ్గపెట్టేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved