Period Talk: మహిళలు పీరియడ్స్ లో అస్సలు చేయకూడనివి ఇవే..!
ఆ సమయంలో తెలిసో తెలియక చాలా మంది పీరియడ్స్ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి.. ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

periods pain
మహిళలకు పీరియడ్స్ ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో విపరీతమైన కడుపులో నొప్పి, అలసట, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇలా చాలానే సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో చిరాకు, అసౌకర్యంగా ఉంటుంది. అయితే.. ఆ సమయంలో తెలిసో తెలియక చాలా మంది పీరియడ్స్ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి.. ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
periods
1.పరిశుభ్రత..
పీరియడ్స్ లో మహిళలు కచ్చితంగా పరిశుభ్రత పాటించాలి. కాస్త నీట్ గా లేకపోయినా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. రెగ్యులర్ గా శానిటరీ ప్యాడ్స్, టాంపూన్లు మార్చుకుంటూ ఉండాలి. జననేంద్రియాల ప్రాంతాన్ని తేలికపాటి సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అలా అని మరీ లోపలికి వాటర్ వెళ్లేలా క్లీన్ చేయకూడదు. దాని వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా.. ధరించే లోదుస్తులు శుభ్రమైనవి ఉండాలి. మీరు ఆ సమయంలో ఎంత శుభ్రమైనవి ధరిస్తే.. అంత మంచిది. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
periods
2.భోజనం మానేయకూడదు...
మహిళలు తమ పీరియడ్స్ సమయంలో ఆకలి విషయంలో చాలా మార్పులు ఉంటాయి. కొందరికి విపరీతమైన ఆకలి ఉంటుంది.. కొందరేమో.. నొప్పి ఉందని అసలు తినకుండా ఉంటారు. ఈ సమయంలో అసలు భోజనం చేయకుండా ఉండటం మంచిది కాదు. క్రమం తప్పకుండా, సమతుల్య భోజనం తినడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, మానసిక స్థితిని తగ్గించడానికి , ఋతు చక్రంకు మద్దతు ఇవ్వడానికి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి సహాయపడుతుంది.
periods
విశ్రాంతి ముఖ్యం:
మహిళలు పీరియడ్స్ సమయంలో శారీరకంగా, మానసికంగా అలసిపోవచ్చు, కాబట్టి మీ శరీరానికి విరామం ఇవ్వడం ముఖ్యం. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఒత్తిడి చేసుకోకండి. ఈ సమయంలో అధిక శ్రమ, అధిక వ్యాయామం లేదా అధిక పనిని నివారించండి. విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం..
బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు:
ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల రక్త ప్రవాహాన్ని పరిమితం చేయవచ్చు. పీరియడ్స్ సమయంలో తిమ్మిరి, అసౌకర్యం పెరుగుతాయి. కాబట్టి.. వీలైనంత వరకు వదులుగా ఉండే దుస్తులు ఎంచుకోవాలి.