Skin GLow TIps: ఇది ఒక్కటి వాడితే చాలు మీ చర్మం మెరిసిపోవడం పక్కా...!
పటికలోని సహజ గుణాలతో చర్మాన్ని శుభ్రం చేసి మచ్చలు తగ్గించుకోవచ్చు. సరైన విధంగా వాడితే మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పటిక-సహజ ఖనిజం
తాతముత్తాతల కాలం నుంచే పటిక అనే పదార్థం ఆరోగ్య, అందం పరంగా విశేషమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇది తెల్లగా పటిక బెల్లం లా ఉండే సహజ ఖనిజం. దీన్ని ప్రధానంగా చర్మ సంబంధిత సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, ఆస్ట్రింజెంట్ వంటి గుణాలున్న పటిక తక్కువ ఖర్చుతో సహజ రీతిలో చర్మ సంరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుంది.
ఆస్ట్రింజెంట్ గుణాలు
పటిక ప్రధానంగా చర్మాన్ని శుభ్రపరచడంలో, మొటిమలను తగ్గించడంలో పని చేస్తుంది. దీనిలో ఉండే ఆస్ట్రింజెంట్ గుణాలు చర్మపు పై పొరను కట్టిపడేస్తూ, అధిక నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఫలితంగా చర్మం తేలికగా గ్లో ఇవ్వడం మొదలవుతుంది. మొటిమల వెనుక అసలు కారణంగా పనిచేసే బ్యాక్టీరియా పెరుగుదలని ఇది అడ్డుకుంటుంది.
చర్మం ఆరోగ్యంగా
పటికను ముఖానికి అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి, చిన్న ముక్కను తీసుకుని గ్లాస్ నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టి, ఆ నీటిని ముఖం శుభ్రం చేసేందుకు వాడవచ్చు. ఇలా చేయడం వలన మురికి పోయి ముఖం మీది రంధ్రాలు బిగుతుగా మారతాయి. ప్రతిరోజూ ఇలా ఒకసారి చేయడం చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
పటికను ఫేస్ ప్యాక్
ఇంకొన్ని సందర్భాల్లో పటికను పొడిగా చేసి దానికి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయొచ్చు. ఆ మిశ్రమాన్ని ముఖం మీద మచ్చలు, డార్క్ స్పాట్స్ ఉన్న చోట వేస్తే, మెల్లగా అవి తగ్గుతాయి. అలాగే తేనె లేదా గ్లిజరిన్‌తో కలిపి పటికను ఫేస్ ప్యాక్‌లా వాడొచ్చు. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది, గ్లిజరిన్ పొడిబారిన చర్మానికి ఉపశమనం ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి 15 నిమిషాల పాటు ఉంచి, తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ముఖ్యమైన జాగ్రత్తలు
అయితే పటిక వాడే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మొదటగా, మీకు ఇది తగినదేనా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే చేతి లోపలి భాగంలో లేదా చెవి వెనక భాగంలో చిన్నగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎర్రదనం, మంట, దురద ఉంటే వెంటనే వాడకూడదు.
పొడిబారే అవకాశం
పటికను ఎక్కువగా వాడటం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంది. అందుకే వారానికి రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి. ఇది వాడిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి. లేదంటే చర్మం డ్రై అయిపోతుంది.సున్నితమైన చర్మం ఉన్నవారు పటిక వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. చాలా తక్కువ మోతాదులో ఉపయోగించడం మొదలుపెట్టడం ఉత్తమం. ముఖ్యంగా పటిక కళ్లకు దగ్గరగా ఉపయోగించడం చాలా ప్రమాదకరం. కళ్లలోకి వెళితే తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు.
చర్మ సమస్యలు
కొందరికి ఇప్పటికే చర్మ సమస్యలు లేదా అలెర్జీలు ఉంటే, డెర్మటాలజిస్ట్ సలహా తీసుకుని వాడాలి. అందంగా మెరిసే ముఖాన్ని కావాలనుకునే వారు ఖరీదైన క్రీములు, ఫేస్ వాష్‌లకు బదులుగా సహజమైన పటిక వాడితే మంచి ఫలితం పొందవచ్చు. అయితే దీనిని జాగ్రత్తగా, సరైన పద్ధతిలో వాడాలి. అధికంగా లేదా నిర్లక్ష్యంగా వాడితే పటిక వల్ల నష్టమే ఎక్కువ.
టెస్ట్ చేసుకుని
పటిక సహజంగా లభించే ఖనిజం కాబట్టి సేఫ్ అని అనుకోవడం పొరపాటు. ఈ మిశ్రమాన్ని వాడే ముందు మీ చర్మానికి సరిపోతుందా లేదా అనే అంశం మీద ఒకసారి టెస్ట్ చేసుకుని మాత్రమే వాడాలి. చర్మ సంరక్షణలో పటికను జాగ్రత్తగా వినియోగించుకుంటే, మీరు అందంగా మెరిసే ముఖాన్ని పొందగలుగుతారు.