ఇలా చేస్తే.. కిచెన్ లో ఒక్క పురుగు కూడా ఉండదు
ఇంట్లో ఏ రూంలో పురుగులు ఉన్నా లేకున్నా కిచెన్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా చీమలు, ఈగలు, దోమలు, బొద్దింకలతో పాటుగా చిన్న చిన్న పురుగులు ఉంటాయి.
మన ఇంట్లో కిచెన్ ఒక ముఖ్యమైన భాగం. దీన్ని ఇంట్లోని అన్ని రూముల కంటే శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఈ కిచెన్ ద్వారానే మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే కిచెన్ శుభ్రంగా లేకపోతే పురుగులు, బొద్దింకలు, చీమలు, కీటకాలు పెరిగిపోతాయి.చాలా మంది ఇంట్లో ఈ పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిని లేకుండా చేయడానికి ఆడవాళ్లు ఎంతో కష్టపడతారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కిచెన్ లో ఒక్క పురుగు లేకుండా చేయొచ్చు. అదెలాగంటే?
వంటింట్లో పురుగులు లేకుండా చేయడానికి మార్కెట్ లో ఎన్నో రకాల కెమికల్స్ దొరుకుతాయి. ఇవి ఇంట్లో పురుగులు లేకుండా చేసినా మనకు మాత్రం హాని చేస్తాయి. అందుకే వంటింట్లో ఉండే పురుగులను సహజంగా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతిరోజూ వంటల్లో వేసుకుని తింటుంటాం. అయితే ఈ వెల్లుల్లి ఒక్క వంటకి మాత్రమే కాదు.. కిచెన్ లో ఉండే పురుగులను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి ఘాటైన వాసన ఇంట్లో పురుగులు లేకుండా చేస్తుంది. ఎందుకంటే దీని వాసన పురుగులకు అస్సలు నచ్చదు. కిచెన్ లో ఉండే పురుగులను తరిమికొట్టడానికి కొన్ని వెల్లుల్లి రెబ్బల తొక్కలను ఒలిచి కిచెన్ లో అక్కడక్కడా పెట్టండి. వీటి వాసనను భరించలేక పురుగులు పారిపోతాయి.
అయితే ఎండిపోయిన వెల్లుల్లి రెబ్బలను తీసి తాజా వెల్లుల్లి రెబ్బలను పెడుతుండాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి నీళ్లు కలిపి స్ప్రే చేసిన వంటింట్లో ఉన్న పురుగులు పారిపోతాయి. మీ కిచెన్ నీట్ గా ఉంటుంది.
నీలగిరి నూనె:
నీలగిరి నూనె మంచి వాసన వస్తుంది. ఈ నూనె కూడా కిచెన్ లో పురుగులు లేకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని చుక్కల నీలగిరి నూనెను నీటిలో కలిపి స్ప్రే బాటిల్ లో పోయండి. దీన్ని వంటగది మొత్తం స్ప్రే చేయండి. దీంతో కిచెన్ లో ఉన్న చిన్న చిన్న పురుగులు, సాలెపురుగులు, బొద్దింకలు చనిపోతాయి.
కర్పూరం
కర్పూరంతో కూడా మీరు వంటింట్లో ఉన్న పురుగులను తరిమికొట్టొచ్చు. ఎందుకంటే కర్పూరం వాసన పురుగులకు అస్సలు నచ్చదు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కర్పూరాన్ని పొడి చేసి దానిలో ఒకటి లేదా రెండు చెంచాల లావెండర్ నూనె కలపండి. పురుగులు ఉండే కిచెన్ లేదా అల్మారా దగ్గర ఉంచండి.
లవంగాలు
సాధారణంగా లవంగాలను వంట చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఈ లవంగాలు పురుగులను తరిమికొట్టడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. లవంగాల ఘాటైన వాసన పురుగుల నచ్చక కిచెన్ నుంచి పారిపోతాయి. ఇందుకోసం లవంగాలను పొడి చేసి నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్ లో పోయండి. దీన్ని కిచెన్ అంతటా చల్లితే పురుగులు పారిపోతాయి.
కిరోసిన్:
కిచెన్ తో కూడా కిచెన్ లో ఒక్క పురుగు లేకుండా పారిపోతాయి. దీనిలో మీరు ఏదీ కలపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా దీన్ని మీరుస్ప్రే బాటిల్ లో పోసి కిచెన్ లో పురుగులు ఉండే చోట చల్లితే సరిపోతుంది. దీని వాసనను భరించలేక పురుగులు పారిపోతాయి. కావాలంటే కిరోసిన్ లో దూది ముక్కలు నానబెట్టి కిచెన్ లో కొన్ని చోట్ల ఉంచినా కూడా పురుగులు అటువైపు రానేరావు.