కత్రినా కైఫ్ ఫిట్నెస్ సీక్రెట్.. ఏం తింటుందో తెలుసా?
భోజనంలో ఉప్పు తక్కువ ఉండేలా చూసుకుంటుందట. మరి కత్రినా కైఫ్‌కి ఎలాంటి ఫుడ్స్ ఇష్టమో చూద్దాం.

Katrina Kaif
సెలబ్రెటీల లైఫ్ అందరిలా ఉండదు. వారిది వేరే ప్రపంచం. వారికింటూ స్పెషల్ గా డిజైనర్స్, సెలబ్రెటీ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు. ఇక ఆహారం విషయానికి వస్తే.. వారికంటూ స్పెషల్ గా పోషకాహారం సూచించేవారు కూడా ఉంటారు. వారు ఎప్పుడూ యవ్వనంగా కనిపించేందుకు.. యోగా. జిమ్ వంటి అనేక విధానాలు ఫాలో అవుతారు. మంచి ఆహారం తీసుకుంటారు. కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు.
Katrina Kaif
మరి బాలీవుడ్ అందాల తార కత్రినా.. ఇంత అందంగా ఉండటానికి రీజన్ ఏంటో తెలుసుకుందామా.. కత్రినా కైఫ్ ది ఫిట్ అండ్ ఫైన్ బాడీ. కత్రినా కైఫ్ నటుడు విక్కీ కౌశల్‌ను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Katrina Kaif
కాగా.. ఫిట్‌నెస్ , డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. కత్రినా కైఫ్ డైట్ నిజమే అయినప్పటికీ, ఆమె తన ప్రతి ఆహారాన్ని పోషకాలు ఉండేలా చూసుకుంటుంది. కత్రినా వెల్లుల్లి, ఉల్లిపాయలు, చక్కెర లేదా తేనెతో కూడిన ఆహారాన్ని తీసుకోదు.
కత్రినా కైఫ్‌కు డైటీషియన్‌గా పనిచేసిన ఢిల్లీ ఇంపీరియల్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ ప్రేమ్ కుమార్ ఇలా అన్నారు: 'కత్రినా తాజా పండ్లు, కొబ్బరి పాలు తీసుకోవడానికి ఇష్టపడుతుంది. భోజనంలో ఉప్పు తక్కువ ఉండేలా చూసుకుంటుందట. మరి కత్రినా కైఫ్‌కి ఎలాంటి ఫుడ్స్ ఇష్టమో చూద్దాం.
అవోకాడో, చిలగడదుంప, పండ్లు: కత్రినా కైఫ్ అవోకాడో పండ్లు, చిలగడదుంపలు, మిక్స్డ్ ఫ్రూట్స్ , ఒక గ్లాసు తాజా కొబ్బరి పాలతో తినడానికి ఇష్టపడుతుంది.
కొబ్బరి ప్రేమికురాలు: కత్రినా కైఫ్ తన భోజనంలో కొబ్బరిని జోడించడానికి ఇష్టపడతారని చెఫ్ ప్రేమ్ చెప్పారు. ఉదయాన్నే కొబ్బరి పాలు, పగటిపూట కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుంటారట.
సూప్: కత్రినా కైఫ్ కూడా సూప్ ప్రియురాలు. స్పైసి సూప్‌ను ఇష్టపడుతుంది. ఇది తేలిక ఆహారంలా ఉపయోగపడుతుంది.
ఫ్రైడ్ రెడ్ యాపిల్: కత్రినా కైఫ్‌కి పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె సాధారణంగా పండ్లను తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కాల్చిన ఎర్రటి యాపిల్స్ తినడానికి ఇష్టపడతారు. పాన్‌లో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి యాపిల్‌లను రోస్ట్‌లో కట్ చేసి సర్వ్ చేయాలి. కొన్నిసార్లు అల్పాహారం కోసం, కొన్నిసార్లు లంచ్ తర్వాత, కత్రినా కైఫ్ ఈ కాల్చిన రెడ్ యాపిల్ తినడానికి ఇష్టపడుతుంది.
చేపలు & చికెన్: కత్రినా రోజువారీ ఆహారంలో చికెన్, చేపలు రెండూ ఉంటాయి. కొన్ని కూరగాయలు, తక్కువ ఉప్పుతో చికెన్ తినడానికి ఇష్టపడుతుంది. నూనె తక్కువగా వేసి చేసిన చేప తినడానికి ఇష్టపడతారు.
వండిన అన్నం, రుచికరమైన కూర: సెలబ్రిటీలు సాధారణంగా అన్నం తినడానికి ఇష్టపడరు. కానీ కత్రినా కైఫ్ తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను ఉడికించిన అన్న, తక్కువ ఉప్పు ఉన్నకూరలు తినడానికి ఇష్టపడుతుంది.
డెజర్ట్ : ఫిట్‌నెస్ గురించి పట్టించుకునే క్యాట్ కి డెజర్ట్ కూడా ఇష్టం. దాల్చినచెక్క, ఎండుద్రాక్ష, కొబ్బరి పాలతో చక్కెర లేదా తేనె కలిపి తాయరు చేసిన స్వీట్ ని ఇష్టంగా తింటుంది.