Hair Growth:కలబంద గుజ్జులో ఇదొక్కటి కలిపి జుట్టుకు రాస్తే చాలు
కేవలం కలబంద గుజ్జులో ఒకటి కలిపి రాస్తే చాలు. మరి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు ఒత్తుగా పెరగాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది.కానీ ఈ రోజుల్లో రకరకాల సమస్యల కారణంగా జుట్టు పెరగడం సంగతి పక్కన పెడితే,ఉన్న జుట్టు కాస్త ఊడిపోతోంది.కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడటం, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం ఇవన్నీ జుట్టు రాలడానికి కారణం కావచ్చు. అయితే.. వీటన్నింటికీ చెక్ పెట్టి.. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేయవచ్చని మీకు తెలుసా? దాని కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం కలబంద గుజ్జులో ఒకటి కలిపి రాస్తే చాలు. మరి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
hair growth
కలబంద గుజ్జులో కర్పూరం కలిపి రాస్తే, జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుందట. కలబందలో జుట్టు పెరుగుదలకు సహాయపడే చాలా పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు,ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక కర్పూరం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదళ్లును బలపరుస్తుంది. మరి, ఈ రెండూ కలిపి రాస్తే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
.
hair growth
జుట్టు పెరుగుదలకు కలబంద, కర్పూరం ప్రయోజనాలు
కలబంద: విటమిన్లు A, C , E లతో సమృద్ధిగా ఉన్న కలబంద తలపై చనిపోయిన చర్మ కణాలను సరిచేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కర్పూరం: కర్పూరం, తలపై రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది జుట్టు కుదుళ్లను సక్రియం చేయడానికి, కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
రెండూ కలిపి రాస్తే: ఈ రెండూ కలిపి ఉపయోగించినప్పుడు, కలబంద జుట్టును హైడ్రేట్ చేస్తుంది, అయితే కర్పూరం దాని శోషణను పెంచుతుంది, పోషకాలు లోతుగా చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఈ డైనమిక్ జంట జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, మొత్తం జుట్టు ఆకృతిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
hair growth
కలబంద, కర్పూరం హెయిర్ మాస్క్
కలబంద , కర్పూరంతో కలిపిన హెయిర్ మాస్క్ మీ తలపై లోతుగా పోషణను అందించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్లు తాజా కలబంద జెల్, ఒక టీ స్పూన్ కర్పూరం పొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె ఉంటే చాలు. వీటన్నింటినీ మంచి పేస్టులాగా కలిపి.. మీ జుట్టుకు రాస్తే చాలు. 30 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ గా చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. జుట్టు అందంగా, పొడవుగా పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ ని రెగ్యులర్ గా రాసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.