Dark Circles: ఈ క్రీం పెడితే డార్క్ సర్కిల్స్ తొందరగా తగ్గిపోతాయి
అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ తేడా లేకుండా చాలా మందికి కళ్ల చుట్టూ ఉన్న చర్మం నల్లగా ఉంటుంది. అయితే ఈ డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడంలో ఒక క్రీం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని రోజూ పెడితే తొందరగా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.

dark circles
మన కళ్ల చుట్టూ ఉన్న చర్మం ముఖ చర్మం కంటే చాలా సున్ నితంగా, మృదువుగా ఉంటుంది. అందుకే ఇక్కడే తొందరగా ముడతలు కనిపిస్తాయి. ఇకపోతే చాలా మందికి డార్క్ సర్కిల్స్ సమస్య ఉంటుంది.
ఒత్తిడి, ఫోన్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం, నిద్రలేమి, కొన్ని అనారోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం నల్లగా అవుతుంది. కానీ దీనివల్ల ముఖ అందం తగ్గుతుంది.
అంతేకాకుండా వీటి వల్ల ఏదో జబ్బున్న వారిలా కూడా కనిపిస్తారు. అందుకు చాలా మంది వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇవి మాత్రం తగ్గవు. కానీ ఒక క్రీం ని పెడితే మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?
డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి సహాయపడే క్రీం ను తయారుచేయడానికి ఒక చెంచా పెట్రోలియం జెల్లీ, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్, 1/2 టీస్పూన్ ఆముదం నూనె, 1/2 టీస్పూన్ కాఫీ పొడి అవసరపడతాయి.
క్రీమ్ ను ఎలా తయారుచేయాలి?
డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవడానికి ఐ క్రీమ్ ను తయారుచేయడానికి ముందుగా ఒక గాజు గిన్నె తీసుకుని అందులో స్పూన్ పెట్రోలియం జెల్లీని వేయండి. దీనిలోనే విటమిన్ ఇ క్యాప్సూల్స్, ఆముదం నూనె వేసి బాగా కలగలపండి.
ఆ తర్వాత దీంట్లోనే కాఫీ పొడిని వేసి కలపండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి చేతులతో కళ్ల చుట్టూ రాసి కొద్దిసేపు నెమ్మదిగా మసాజ్ చేయండి. కొద్దిసేపటి తర్వాత చల్ల నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.
అండర్-ఐ క్రీమ్ ఎలా పనిచేస్తుంది
వాసెలిన్, విటమిన్ ఇ వంటి వాటితో తయారు చేయబడిన ఈ అండర్-ఐ క్రీమ్ మన కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. అలాగే దీనిలోని పెట్రోలియం జెల్లీ కళ్ల దగ్గర చర్మం పెళుసుగా,సన్నబడకుండా చేయడానికి సహాయపడుతుంది. ఈ అండర్ ఐ క్రీమ్ ను రోజూ 15 రోజుల పాటు అప్లై చేస్తే కొన్ని రోజుల్లోనే కనిపించకుండా పోతాయి.