చర్మం పై మ్యాజిక్ చేసే దానిమ్మ...!
దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో దానిమ్మ నూనె, దానిమ్మ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. ఈ విషయం మనకు తెలిసిందే. అన్ని పండ్లలో కెల్లా... దానిమ్మ పండును సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. ఎందుకంటే... దీని వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండును గింజల రూపంలో లేదంటే... జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చర్మం పై మ్యాజిక్ చేస్తాయి.
దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో దానిమ్మ నూనె, దానిమ్మ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దానిమ్మ గింజలను ఉపయోగించి ఫేస్ మాస్క్ లను కూడా తయారు చేస్తున్నారు. అసలు దానిమ్మ పండు వల్ల మన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి చూద్దాం....
దానిమ్మ యాంటీమైక్రోబయల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది: ఈ పండులో విటమిన్ సి ఉంటుంది, ఇది మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలకు కారణమయ్యే చర్మంలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తదర్వారా మొటిమలు రాకుండా నివారించవచ్చు.
ఇది UV నుండి చర్మాన్ని రక్షిస్తుంది: దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇది సూర్యుని హానికరమైన UV కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. అయితే... వీటిని తీసుకుంటున్నాము కదా అని సన్ స్క్రీన్ లోషన్ వాడటం మానేయకూడదు. మీరు సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం కూడా ముఖ్యం. చర్మం దెబ్బతినకుండా నిరోధించడానికి పండ్లపై మాత్రమే ఆధారపడకూడదు.
దానిమ్మ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంది: పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తిని పెంచడం ద్వారా ముడతలు , ఇతర వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి.
దానిమ్మ తొక్క పొడి, పాలు: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల దానిమ్మ తొక్క పొడి (Pomegranate peel powder), పాలు (Milk) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే జిడ్డు సమస్యలు తగ్గుతాయి. దీంతో చర్మ సౌందర్యం మరింత రెట్టింపు అవుతుంది.
దానిమ్మ తొక్క పొడి, నిమ్మరసం: ఒక కప్పులో కొద్దిగా దానిమ్మ తొక్క పొడి (Pomegranate peel powder), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.