MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Investment Tips : మీ పిల్లల్ని లక్షాధికారులుగా మార్చే పీపీఎఫ్ స్కీమ్.. ఏమిటిది? వేల పెట్టుబడితో లక్షలెలా వస్తాయి?

Investment Tips : మీ పిల్లల్ని లక్షాధికారులుగా మార్చే పీపీఎఫ్ స్కీమ్.. ఏమిటిది? వేల పెట్టుబడితో లక్షలెలా వస్తాయి?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ అద్భుతమైన పథకం. ఇందులో ప్రతినెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు లక్షల రూపాయల సంపదను సృష్టించవచ్చు.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 28 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మీ పిల్లలకు లక్షలు తెచ్చిపెట్టే సూపర్ స్కీమ్
Image Credit : Getty

మీ పిల్లలకు లక్షలు తెచ్చిపెట్టే సూపర్ స్కీమ్

పిల్లల ఉన్నత చదువులు, విదేశీ విద్య, పెళ్లిళ్లు లేదా వ్యాపారం ప్రారంభించడం వంటి భవిష్యత్ అవసరాల కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయడం చాలా తెలివైన నిర్ణయం. ప్రతినెలా కొన్ని వేల రూపాయలు దాచుకున్నా, చక్రవడ్డీ (Compound Interest) తో కలిపి అది కొన్ని లక్షల రూపాయలుగా పెరుగుతుంది. ఇందుకు ప్రభుత్వ సపోర్ట్ కలిగిన ఉత్తమ పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పీపీఎఫ్ అంటే ఏంటి?
Image Credit : Getty

పీపీఎఫ్ అంటే ఏంటి?

పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ తో నడిచే ఒక దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇందులో పెట్టిన డబ్బుకు ప్రభుత్వ భద్రత ఉంటుంది కాబట్టి పెట్టుబడిదారులు ఎలాంటి భయం లేకుండా పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకంలో అసలు ప్రత్యేకత ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడికే కాకుండా, దానిపై వచ్చే వడ్డీకి కూడా మళ్లీ వడ్డీ లభిస్తుంది. దీనినే "చక్రవడ్డీ" (Compound Interest) అంటారు. దీనివల్ల మొదట్లో చిన్న మొత్తంగా ఉన్న పెట్టుబడి, సంవత్సరాలు గడిచేకొద్దీ పెద్ద మొత్తంగా మారుతుంది.

37
పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చా?
Image Credit : Getty

పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చా?

తప్పకుండా... 18 ఏళ్లలోపు పిల్లల పేరు మీద తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. పిల్లలు చిన్న వయసులోనే ఖాతా తెరిస్తే, ఎక్కువ సంవత్సరాలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనం కూడా ఎక్కువగా లభిస్తుంది. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత, అవసరమైన KYC పత్రాలు సమర్పించి ఖాతా పూర్తి నియంత్రణను వాళ్లే తీసుకోవచ్చు.

47
నెలకి రూ.5,000 పొదుపు చేస్తే ఎంత వస్తుంది?
Image Credit : Getty

నెలకి రూ.5,000 పొదుపు చేస్తే ఎంత వస్తుంది?

మీరు మీ పిల్లల పేరు మీద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ప్రతినెలా రూ.5,000 చొప్పున పెట్టుబడి పెడితే ప్రస్తుత 7.1% వార్షిక వడ్డీ రేటు ప్రకారం భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టవచ్చు. 

ఉదాహరణలు..

15 ఏళ్లు క్రమం తప్పకుండా నెలకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి పెడితే మీరు కట్టే మొత్తం రూ.9,00,000 అవుతుంది. దానికి వడ్డీగా రూ.7,27,284 వచ్చి మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.16,27,284 మీ చేతికి వస్తుంది. 

ఒకవేళ 20 ఏళ్లు పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి రూ.12,00,000 అవుతుంది. దీనికి వడ్డీగా రూ.14,63,161 కలిసి మెచ్యూరిటీకి రూ.26,63,161 లభిస్తుంది. 

25 ఏళ్లు పెట్టుబడి పెడితే మీరు కట్టిన మొత్తం రూ.15,00,000కు, వడ్డీ రూపంలోనే రూ.26,18,870 వరకు వస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో రూ.41,18,870 అనే భారీ మొత్తాన్ని పొందవచ్చు. 

క్లుప్తంగా చెప్పాలంటే మీరు పెట్టిన అసలు కంటే చాలా రెట్లు ఎక్కువ మొత్తాన్ని వడ్డీ రూపంలోనే పొందడం ఈ పీపీఎఫ్ పథకం గొప్పతనం.

57
ఈ 3 నియమాలు తెలియకుండా పీపీఎఫ్ ప్రారంభించవద్దు
Image Credit : Getty

ఈ 3 నియమాలు తెలియకుండా పీపీఎఫ్ ప్రారంభించవద్దు

1. ఏడాదికి రూ.1.5 లక్షల వరకే పెట్టుబడి పరిమితి

ఒక ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు, పిల్లల పీపీఎఫ్ ఖాతాలను కలిపి పన్ను మినహాయింపు కోసం గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షలు. ఈ పరిమితి దాటి పెట్టుబడి పెడితే అదనపు మొత్తానికి పన్ను మినహాయింపు లభించదు. 

2. ప్రతి నెలా 5వ తేదీలోపు డబ్బు కట్టండి

పీపీఎఫ్ ఖాతాలో ప్రతి నెలా 5వ తేదీలోపు డబ్బు జమ చేస్తే ఆ నెలకు పూర్తి వడ్డీ లభిస్తుంది. 5వ తేదీ తర్వాత పెట్టుబడి పెడితే ఆ నెల వడ్డీని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి నెల ప్రారంభంలోనే పెట్టుబడి పెట్టడం మంచిది. 

3. 18 ఏళ్ల తర్వాత ఖాతా హక్కులు పిల్లలకే

పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత, అవసరమైన KYC అప్‌డేట్ చేశాక ఖాతా పూర్తి నియంత్రణ పిల్లలకే వెళ్తుంది. ఆ తర్వాత వాళ్లు తమ పెట్టుబడిని సొంతంగా నిర్వహించుకోవచ్చు.

67
పీపీఎఫ్‌లో లభించే ముఖ్య ప్రయోజనాలు
Image Credit : Getty

పీపీఎఫ్‌లో లభించే ముఖ్య ప్రయోజనాలు

పీపీఎఫ్ పథకంలో వచ్చే వడ్డీ, మరుసటి ఏడాది అసలు పెట్టుబడితో కలిసి మళ్లీ వడ్డీని సంపాదిస్తుంది. దీనివల్ల సంవత్సరాలు గడిచేకొద్దీ, డబ్బు వృద్ధి వేగంగా పెరుగుతుంది. అందుకే ఆర్థిక నిపుణులు "పెట్టుబడిని వీలైనంత త్వరగా ప్రారంభించండి" అని సూచిస్తారు.

ప్రభుత్వ సపోర్ట్ ఉన్న సురక్షితమైన పొదుపు పథకమిది. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం.. ఈ మూడింటికీ పన్ను మినహాయింపు (EEE) సౌకర్యం ఉంటుంది.  దీర్ఘకాలంలో అధిక చక్రవడ్డీ ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లల చదువు, పెళ్లి, వ్యాపారం వంటి భవిష్యత్ ఖర్చులకు సరైన పొదుపు… చిన్న మొత్తం నుంచే పెట్టుబడిని ప్రారంభించవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా ఖాతా తెరవొచ్చు.

77
ఈ పథకం ఎవరికి బాగా సరిపోతుంది?
Image Credit : Asianet News

ఈ పథకం ఎవరికి బాగా సరిపోతుంది?

* కొత్తగా తల్లిదండ్రులైన వారికి. 

* పిల్లల ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేసేవారికి. 

* రిస్క్ లేని దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకునేవారికి. 

* పన్ను మినహాయింపుతో పొదుపు చేయాలనుకునే వారికి. 

* ప్రతినెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటును అలవర్చుకోవాలనుకునే కుటుంబాలకు.

పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఒకేసారి కూడబెట్టాల్సిన అవసరం లేదు. ప్రతినెలా కొన్ని వేల రూపాయలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టినా, చక్రవడ్డీ శక్తితో అది లక్షల రూపాయలుగా పెరుగుతుంది. భద్రత, పన్ను మినహాయింపు, దీర్ఘకాలిక సంపద సృష్టి.. ఈ మూడు ప్రయోజనాలను ఒకే పథకంలో కోరుకునే తల్లిదండ్రులకు పీపీఎఫ్ ఖాతా ఒక ఉత్తమ ఎంపిక. ఈ రోజు మీరు మొదలుపెట్టే చిన్న పొదుపే, రేపు మీ పిల్లల పెద్ద కలలను నిజం చేసే ఆర్థిక వనరుగా మారవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ప్రభుత్వ పథకాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Capital : రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, భారదేశపు అన్నపూర్ణ రాష్ట్రం ఏది? ఎందుకిలా పిలుస్తారు?
Recommended image2
Milk: ఆ దేశంలో లీటర్ పాలు రూ. 400.. ఎందుకంత ఖరీదు? ఆ పాలల్లో స్పెషాలిటీ ఏంటి?
Recommended image3
Taj Mahal: తాజ్ మహల్‌లో ఒక్క లైట్ కూడా ఎందుకు లేదు? రాత్రయితే చీకటిగానే ఎందుకు ఉంచుతారు?
Related Stories
Recommended image1
PPF: సింపుల్ పెట్టుబడితో నెలకు రూ.80 వేల వరకు ఆదాయం: టాక్స్ కూడా కట్టక్కరలేదు
Recommended image2
PPF: ప్రతీ నెల మీకొచ్చే రూ. 2 వేల పెన్షన్ పక్కన పెడితే.. 6 లక్ష‌లు మీ సొంతం చేసుకోవ‌చ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved