MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • PPF: సింపుల్ పెట్టుబడితో నెలకు రూ.80 వేల వరకు ఆదాయం: టాక్స్ కూడా కట్టక్కరలేదు

PPF: సింపుల్ పెట్టుబడితో నెలకు రూ.80 వేల వరకు ఆదాయం: టాక్స్ కూడా కట్టక్కరలేదు

PPF: రిస్క్ లేని, సురక్షితమైన ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా? అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)లో పెట్టుబడి పెట్టండి. దీని ద్వారా నెలకు నికరంగా రూ.80 వేల వరకు ఆదాయం సంపాదించొచ్చు. దీని కోసం ఇక్కడ బెస్ట్ ప్లాన్ ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 13 2025, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇది పెట్టుబడిదారులకు భద్రత, స్థిరత్వం, పన్ను మినహాయింపు లాభాలను అందిస్తుంది.
PPF ఖాతాలో పెట్టుబడిపై 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. ఇది పూర్తవకుండా నిధులను పూర్తిగా విత్ డ్రా చేసుకోలేరు. అవసరమైతే PPF లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత మీరు టైమ్ పీరియడ్ ని 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ఏటా కనీసం రూ. 500 నుంచి మాక్సిమం రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి చేయడం ద్వారా సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. కాబట్టి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుండి నెలకు రూ. 80,000 కంటే ఎక్కువ పన్ను రహిత ఆదాయాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

35

నెలకు ఆదాయం

PPF నుండి నెలకు రూ. 80,000 కంటే ఎక్కువ సంపాదించడానికి ప్రతి సంవత్సరం రూ. 1.50 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఇలా 15 సంవత్సరాలు పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ కాలం పూర్తయ్యే వరకు PPF లాక్-ఇన్ వ్యవధి అంటారు. ఆ తర్వాత మీరు నెలకు రూ.80 వేల వరకు ఆదాయం పొందొచ్చు. 

ఈ పెట్టుబడిపై 7.1% వడ్డీ రేటుతో సంవత్సరానికి రూ.10.13 లక్షలు వడ్డీ పొందవచ్చు. అంటే నెలకు సుమారు రూ.84,500 పన్ను మినహాయింపు ఆదాయం పొందవచ్చు. 

 

45

సంవత్సరానికి రూ.1.50 లక్షల చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మొత్తం రూ. 22,50,000 అవుతుంది. దీనికి అంచనా వడ్డీ రూ.18,18,209. అంటే మొత్తం రూ. 40,68,209 మీరు సంపాదిస్తారు.  మీరు గాని మరో 5 సంవత్సరాలు సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే 20 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 30,00,000 అవుతుంది. అంచనా వడ్డీ రూ. 36,58,288 లభిస్తుంది. అప్పుడు మొత్తం కార్పస్ రూ. 66,58,288 అవుతుంది. ఇప్పుడు కూడా కావాలంటే మీరు మరో 5 సంవత్సరాలు పెట్టుబడి పొడిగించుకోవచ్చు. 

 

55

ఇలా పీపీఎఫ్ పెట్టుబడి టైమ్ పీరియడ్ పెంచుతూ 29 ఏళ్ల పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.43.5 లక్షలు అవుతుంది. అంచనా వడ్డీ ఆదాయం రూ.99.26 లక్షలు లభిస్తుంది. అప్పుడు మొత్తం కార్పస్ రూ.1.42 కోట్లు అవుతుంది. 

దీన్ని బట్టి సంవత్సరానికి కేవలం రూ.1.50 లక్షల పెట్టుబడితో లాంగ్ టర్మ్ లో రూ.కోట్లు సంపాదించొచ్చు. పీపీఎఫ్ ద్వారా సంపాదించే ఆదాయానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రభుత్వ పథకాలు
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
ప్రతి ఇంటికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు: మీరు అర్హులేనా? ఇక్కడ చెక్ చేయండి
Recommended image2
Gold Prices: బంగారం కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధర. ఎంత తగ్గిదంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved