MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • వైట్ డిశ్చార్జ్ తో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో ఈ వాటర్ ను తాగితే సమస్య మాయం..!

వైట్ డిశ్చార్జ్ తో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో ఈ వాటర్ ను తాగితే సమస్య మాయం..!

ఆడవాళ్లు ఎక్కువగా మూత్రంలో తెల్లని ఉత్సర్గ లేదా తెల్లబట్ట, యూటీఐ మంట వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్ సమస్య ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే దీనిని తగ్గించడానికి బియ్యం వాటర్ ఎంతో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. మరి దీన్ని ఎలా తయారుచేయాలంటే?

Shivaleela Rajamoni | Published : Nov 09 2023, 02:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

అన్నం వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడుగుతారు. ఈ కడిగిన వాటర్ ను బయట చల్లేస్తారు. కానీ ఈ వాటర్ మన చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అవును ఈ బియ్యం వాటర్ లో ఎన్నో లక్షణాలు ఉంటాయట. ఈ బియ్యం బాటర్ మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ ను ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ వాటర్ లో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

25
rice water

rice water

ఆయుర్వేదంలో.. బియ్యం నీటిని ఎన్నో ఏండ్లుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ వాటర్ సహాయంతో పైసా ఖర్జు లేకుండా యూటీఐ, వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

35
Asianet Image

బియ్యం నీటిని ఎలా తయారు చేయాలి?

దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోండి. ఈ బియ్యంలో 60-80 మిల్లీలీటర్ల నీటిని పోయండి. దీన్ని 2 నుంచి 6 గంటల వరకు అలాగే ఉంచండి. ఇంకేముందు ఈ నీటిని తాగొచ్చు.  ఈ వాటర్ ను ఒకేసారి తాగొచ్చు. లేదా రోజంతా కొన్ని కొన్ని తాగొచ్చు. ఎలా తాగినా ఈ వాటర్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఈ వాటర్ ను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

45
rice water

rice water

బియ్యం నీటి ప్రయోజనాలు

1. రైస్ వాటర్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. 

2.  చాలా మంది ఆడవారు తెల్లబట్ట తో బాధపడుతుంటారు. అయితే ఈ వాటర్ ను తాగితే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

55
rice water

rice water


3. రైస్ వాటర్ లో చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ ను తాగితే విరేచనాలు, మూత్రంలో చికాకు, రక్తస్రావం రుగ్మత, హెవీ పీరియడ్స్ వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 

4. ఈ వాటర్ తో తాగడమే కాుద.. ముఖానికి కూడా కూడా ఉపయోగించొచ్చు. దీన్ని ముఖానికి రాయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. 

5.  బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తాయి. అలాగే పిగ్మెంటేషన్ ను నివారిస్తాయి. వృద్ధాప్య ప్రభావాలను కూడా తగ్గిస్తాయి.
 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories