Hair Care:ఈ రెండు రోజూ తింటే.. హెయిర్ ఫాల్ ఉండదు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
జుట్టు రాలడం మొదలవ్వగానే, చాలా మంది అమ్మాయిలు బాధపడతారు. జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించాలని మరింత ఒత్తిడికి గురౌతారు. మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు వాడటం మొదలుపెడతారు.

జుట్టు రాలడాన్ని తగ్గించాలా?
నేటి కాలంలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పని ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు, కొన్ని పోషకాలు శరీరానికి అందకపోవడం కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
జుట్టు రాలడం మొదలవ్వగానే, చాలా మంది అమ్మాయిలు బాధపడతారు. జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించాలని మరింత ఒత్తిడికి గురౌతారు. మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు వాడటం మొదలుపెడతారు. ఎవరు ఏ చిట్కా చెబితే, దానిని వాడేస్తూ ఉంటారు. కానీ, రెండు రకాల పోషకాలను ప్రతిరోజూ డైట్ లో తీసుకుంటే.. కచ్చితంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గుతుంది.
విటమిన్ల లోపం ఉంటే...
శరీరంలో పోషకాల లోపం జుట్టు బలహీనంగా మారడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఐరన్ లోపం ఉంటే.. ఆరోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి. శరీరంలో ఐరన్ లోపిస్తే.. రక్తం కూడా తగ్గుతుంది. దీని కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది. లేదా.. చిట్లిపోవడం లాంటి సమస్యలు మొదలౌతాయి. మీరు కూడా జుట్టురాలే సమస్యతో బాధపడుతన్నట్లయితే.. తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి.
జుట్టు రాలడాన్ని తగ్గించే మార్గాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, జుట్టు రాలడం సమస్య విషయంలో మీరు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీని కోసం, మునగాకును ఏదో ఒక రూపంలో మీ డైట్ లో భాగం చేసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇది జుట్టు మూలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా, జుట్టు ఒత్తుగా మారుతుంది.
మునగాకుతో జుట్టు రాలడం తగ్గించడం ఎలా?
అంతేకాదు, ఈ మునగాకులో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది తలకు తేమకు మంచిగా అందిస్తుంది. దీనితో పాటు.. పాలకూర, మెంతులు, పప్పులు, కిడ్నీ బీన్స్ , ఎండు ద్రాక్ష, దానిమ్మ, బీట్రూట్, గుడ్లు వంటివి కూడా తీసుకోవాలి. ఇవి కూడా మీ జుట్టును బలంగా మారుస్తాయి. వీటిని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకున్నప్పుడే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఏం తినాలి?
దీనితో పాటు, మీరు విటమిన్ సిని కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ సి శరీరంలో ఐరన్ ని బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి జుట్టుకు అవసరమైన కొల్లాజెన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం, మీరు నారింజ, నిమ్మ, ఆమ్లా, కివి, జామ తినాలి.ఆహారంలో ఐరన్, విటమిన్ సి చేర్చుకోవడం ద్వారా, జుట్టు ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.