డబ్బు మీద విరక్తి తో కోటీశ్వరుడి కూతురు ఏం చేసిందో తెలుసా?
డబ్బులేక అష్టకష్టాలు పడేవారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. కానీ, ఐశ్వర్యంలో పుట్టి, ఐశ్వర్యంలో పెరిగిన ఓ అమ్మాయి కి మాత్రం.. ఆ డబ్బు మీదే విరక్తి కలిగింది.సంతోషంగా పెళ్లి చేసుకొని భర్తతో జీవితం సాగించాల్సిన యువతి జీవితంలో ఎవరూ తీసుకొని ఓ నిర్ణయం తీసుకుంది. ఏకంగా సన్యాసం పుచ్చుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
డబ్బు ఉంటే ఎలాంటి కష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. చాలా మంది కోటీశ్వరులను చూసి.. తాము కూడా కోటీశ్వరుల ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేదని, కావాలనుకున్న లగ్జరీ లైఫ్ ని లీడ్ చేసేవాళ్లం అని అనుకుంటారు. ఇలా చాలా మంది కోరుకునే అద్భుతమైన జీవితం ఓ యువతికి దక్కింది. పుట్టుకతోనే కోటీశ్వరురాలు. చిటికెస్తే.. కోరుకున్నవన్నీ కళ్ల ముందు వాలతాయి. యుక్త వయసుకు చేరుకున్న ఆమెకు ఘనంగా వివాహం చేయాలని పేరెంట్స్ కలలు కన్నారు. కానీ, ఆమె మాత్రం కన్నవారికి షాకిచ్చింది. వైవాహిక జీవితం, డబ్బు ఏమీ తనకు వద్దు అని సన్యాసం పుచ్చుకుంటాను అంటూ బాంబు పేల్చింది. మరి, ఆమె ఎవరు? ఆమె కథేంటో తెలుసుకుందాం..
కర్ణాటక లోని కళ్యాణ్ లోని యాదిర్ నగరంలోని జైన్ బ్లాక్ కి చెందిన కోటీశ్వరుడు నరేంద్ర గాంధీ.మూడు, నాలుగు తరాలుగా వ్యాపారంలో ఉన్న నరేంద్ర గాంధీ కోట్లలో ఆస్తులను కూడపెట్టాడు. ఆయనకు భార్య సంగీత గాంధీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె నిఖితా గాంధీని చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.ఆమె కోరింది ఏదీ కాదనకుండా తీసుకువచ్చేవాడు. ఆమె ప్రస్తుత వయసు 26 ఏళ్లు. కాగా.. ఎప్పటి నుంచో వివాహం చేయాలని వారు ప్రయత్నించినా, ఆమె అంగీకరించలేదు.
ఇంట్లో పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే.. ఎవరినైనా ప్రేమించిందేమో అని అనుమానపడేరు. అస్సలు కాదు.డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగిన ఆ అమ్మాయి కి.. ఆ డబ్బు మీద, లగ్జరీ లైఫ్ మీద విరక్తి పుట్టింది. ఆమె సన్యాసం తీసుకోవాలని అనుకుంది. దాదాపు ఏడేళ్లుగా.. సన్యాసం పుచ్చుకోవాలని ఆమె ప్రయత్నించి, రీసెంట్ గా సన్యాసం పుచ్చుకోవడం గమనార్హం.
సన్యాసం తీసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
జైనమతం ప్రకారం, సన్యాసి అయిన తర్వాత, ప్రతి ఒక్కరూ అత్యంత కష్టతరమైన మార్గాన్ని తీసుకోవాలి.బతికున్నంత వరకు కనీసం చెప్పులు కూడా ధరించకూడదు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాలి. ఎలాంటి వాహనం కూడా ఎక్కకూడదు.వారు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఒకే చోట ఉండటానికి అనుమతించబడరు. వారు కేవలం తెల్లని దుస్తులు ధరించాలి. ప్రతిరోజూ కాలినడకనే ప్రయాణించాలి. తల మీద జుట్టు కూడా ఉండదు. జుట్టు మొత్తం తొలగించి గుండు చేస్తారు. జీవితాంతం గుండు తోనే ఉండాలి.
సన్యాసిగా మారే మార్గం చాలా కష్టం అయినప్పటికీ, నికితా ఆ మార్గాన్నే ఎంచుకుంది. కోటీశ్వరుడి కూతురుగా ఇంతకాలం విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె.. దానిని మొత్తం వదులుకుంది.నిఖితా సన్యాసిగా మారినందుకు గుర్తుగా నగరంలో ఒక గొప్ప ఊరేగింపు జరిగింది. ఆమె ఇకపై ఏ వస్తువులను ఉపయోగించదు కాబట్టి, ఆమె వేలాది మందికి కొత్త దుస్తులతో సహా వివిధ వస్తువులను దానం చేసింది.