Lips: రాత్రి పడుకునే ముందు ఇదొక్కటి రాసినా.. మీ పెదాలు ఎర్రగా మారతాయి..!
మన పెదాలు నల్లగా కనిపించడానికి మన లైఫ్ స్టైల్, ఆరోగ్య సమస్యలు, కొన్ని రకాల అలవాట్లు కూడా కారణం కావచ్చు. ఆ మార్పులు చేసుకుంటే కచ్చితంగా మీ అధరాలను అందంగా చేసుకోవచ్చు.

Lips
తమ ముఖ చర్మం అందంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే.. మన ముఖం అందంగా కనిపించాలి అంటే.. ఆ ముఖంలోని భాగం అయిన పెదాలు కూడా అంతే అందంగా ఉండాలి. కానీ చాలా మందికి పెదాలు నల్లగా ఉంటాయి. దాని వల్ల ముఖంలో కళ తగ్గుతుంది. పిగ్మెంటెడ్ లిప్స్ ని కవర్ చేయడానికి చాలా మంది రకరకాల లిప్ బామ్స్, లిప్ స్టిక్స్ వాడుతూ ఉంటారు. కానీ, వాటిలో ఉండే కెమికల్స్... మరింత నల్లగా మార్చేస్తాయి. కానీ.. మనం వాటిని సహజంగా మళ్లీ ఎర్రగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
మన పెదాలు నల్లగా కనిపించడానికి మన లైఫ్ స్టైల్, ఆరోగ్య సమస్యలు, కొన్ని రకాల అలవాట్లు కూడా కారణం కావచ్చు. ఆ మార్పులు చేసుకుంటే కచ్చితంగా మీ అధరాలను అందంగా చేసుకోవచ్చు.
పెదాలు నల్లగా మారడానికి కారణాలు..
రక్త హీనత: మీ పెదవులు తెల్లగా లేదా చాలా లేతగా ఉంటే, రక్తహీనత ఒక ప్రధాన కారణం కావచ్చు. శరీరంలో తగినంత రక్తం లేనప్పుడు లేదా హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు పెదవులు పాలిపోతాయి. రక్తహీనతను సరిచేయడం ద్వారా పెదవుల సాధారణ గులాబీ రంగు వచ్చేలా చేయవచ్చు. వైద్యుడిని సంప్రదించి దీనికి సరైన చికిత్స పొందడం ముఖ్యం.
నీలి పెదవులు (ఆక్సిజన్ లేకపోవడం): పెదవులు నీలం రంగులోకి మారితే, అది శరీరంలో ఆక్సిజన్ లేకపోవడానికి సంకేతం కావచ్చు. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో పెదవులు కూడా నీలం రంగులోకి మారవచ్చు. ఈ లక్షణాన్ని విస్మరించకుండా , వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
నల్లని పెదవులు..
ధూమపానం: పొగాకులోని నికోటిన్ పెదవులకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, వాటిని నల్లగా చేస్తుంది. ధూమపానం మానేయడం వల్ల మీ పెదవుల రంగు మెరుగుపడుతుంది.
తగినంత హైడ్రేషన్ లేకపోవడం: తగినంత నీరు తాగకపోవడం వల్ల పెదవులు ఎండిపోయి నల్లగా కనిపిస్తాయి.
అధిక సూర్యరశ్మి: సూర్యుడి నుండి వచ్చే UV కిరణాలు పెదవుల రంగు మారడానికి , నల్లబడటానికి కారణమవుతాయి. సన్‌స్క్రీన్ లిప్ బామ్ వాడటం వల్ల మీ పెదవులను రక్షించుకోవచ్చు.
లిప్‌స్టిక్: మహిళలు ప్రతిరోజూ ఉపయోగించే రసాయన ఆధారిత లిప్‌స్టిక్‌లు కొన్నిసార్లు అలెర్జీలకు కారణమవుతాయి. పెదవులు నల్లగా మారుతాయి. నాణ్యమైన, సహజ పదార్ధాలను కలిగి ఉన్న లిప్‌స్టిక్‌లను ఎంచుకోవడం మంచిది.
మీ పెదాలను మళ్ళీ పింక్ రంగులోకి మార్చడానికి కొన్ని సహజ మార్గాలు
కొబ్బరి నూనె మసాజ్: ప్రతి రాత్రి పడుకునే ముందు, ఒక టీస్పూన్ కొబ్బరి నూనె తీసుకొని మీ పెదవులపై ఒక నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి. కొబ్బరి నూనెలోని లారిక్ ఆమ్లం సహజంగా మీ పెదవులపై ఉన్న నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. వాటిని మృదువుగా , ప్రకాశవంతంగా చేస్తుంది. నెల రోజుల పాటు క్రమంగా దీనిని ప్రయత్నించడం వల్ల.. మీ పెదాలు ఎర్రగా మారిపోతాయి.
ఆరోగ్య సమస్యలు ఉంటే..
పెదవుల రంగు మారడం కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అందువల్ల, పైన పేర్కొన్న ఇంటి నివారణలు ఉపశమనం కలిగించకపోతే లేదా మీరు ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.