Hair Care: ఎండాకాలంలో జుట్టుకు నూనె రాస్తే ఏమౌతుంది?
హెయిర్ కేర్ అంటే.. ఖరీదైన నూనెలు, షాంపూలు, సీరమ్స్ మాత్రమే వాడాలని రూలేమీ లేదు. మన రెగ్యులర్ కొబ్బరి నూనె వాడినా చాలు. కొబ్బరి నూనెతో రెగ్యులర్ గా తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.

జుట్టు పొడవుగా, ఒత్తుగా అందంగా కనిపించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ, కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం లాంటి కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోవడం,చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. మనం హెయిర్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.హెయిర్ కేర్ అంటే.. ఖరీదైన నూనెలు, షాంపూలు, సీరమ్స్ మాత్రమే వాడాలని రూలేమీ లేదు. మన రెగ్యులర్ కొబ్బరి నూనె వాడినా చాలు. కొబ్బరి నూనెతో రెగ్యులర్ గా తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.
అయితే..ఎండాకాలంలో జుట్టుకు నూనె రాయచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే.. ఈ సీజన్ లో చెమటలు ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నూనె రాస్తే మరింత చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ, ఎండాకాలంలో కూడా మనం కొబ్బరి నూనె రాయవచ్చట.ఇలా రాయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
ఎండాకాలంలో కూడా ఎలాంటి సంకోచాలు లేకుండా తలకు కొబ్బరి నూనె రాయచ్చు. అయితే.. మరీ ఎక్కువగా కాకుండా.. కొద్దిగా రాస్తూ.. చక్కగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ జరుగుతుంది. తలనొప్పి, టెన్షన్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి.ఒత్తిడి తగ్గిన అనుభూతి కలుగుతుంది. కండరాలు కూడా విశ్రాంతి పొందుతాయి. నూనె కూడా తలంతా వర్తిస్తుంది. ఇలా రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల..జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
వేసవిలో చెమట పట్టడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. కానీ, ఆయిల్ నూనె మసాజ్ చేయడం ద్వారా, ఈ రాలడాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. దీని కోసం, మీరు కొబ్బరి నూనె, కుసుమ నూనె, బాదం నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించవచ్చు. ఇది చుండ్రును తగ్గించడానికి,జుట్టుకు మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది.
వేసవి నెలల్లో ఎండలో బయటకు వెళ్లడం వల్ల మీ జుట్టుకు చాలా నష్టం జరుగుతుంది. బలమైన సూర్యకాంతి , సూర్య కిరణాలు మీ జుట్టును డ్రై గా, ఎండిపోయినట్లుగా చేస్తాయి. మీ జుట్టును ఎండ నుండి రక్షించుకోవడానికి ఈ నూనె సహాయపడుతుంది. అలా అని ప్రతిరోజూ జుట్టుకు నూనె రాయాల్సిన అవసరం లేదు. రాత్రి పడుకునే ముందు రాసుకోవచ్చు. లేదంటే.. తలస్నానానికి కొన్ని గంటల ముందు రాసినా చాలు. ఆ తర్వాత ఘాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చాలు.