Face Glow: ఒక స్పూన్ కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే, మీ ముఖంలో గ్లో రావడం పక్కా..!
కాఫీ పొడితో ఇప్పటి వరకు మీరు కమ్మనైన వేడి వేడి కాఫీ తాగే ఉంటారు. కానీ, ఈ కాఫీ పొడితో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.
Face Glow
ఏదైనా స్పెషల్ డే వస్తే చాలు తాము సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి అని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఏవైనా వస్తే అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు. ఫంక్షన్ రోజు మేకప్ వేసుకుంటారు. ఈ రెండూ ఖర్చుతో కూడుకున్నవే. ఈ రెండూ లేకపోయినా.. స్పూన్ కాఫీ పొడి ఉన్నా మీ ముఖం అందంగా మెరిసిపోతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
ఫేస్ ప్యాక్ తో మెరిసే అందం..
కాఫీ పొడితో ఇప్పటి వరకు మీరు కమ్మనైన వేడి వేడి కాఫీ తాగే ఉంటారు. కానీ, ఈ కాఫీ పొడితో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు. కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. ముఖాన్ని కాంతి వంతంగా, మృదువుగా మార్చడానికి కూడా సహాయపడతాయి.
ఫేస్ ప్యాక్ కి కావాల్సిన పదార్థాలు...
కాఫీ పౌడర్ – 1 టీస్పూన్
హనీ (తేనె) – 1 టీస్పూన్
పెరుగు – 1 టీస్పూన్ (లేదా) పాలు – 1 టీస్పూన్
కాఫీతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి?
ఓ బౌల్‌లో కాఫీ పౌడర్, తేనె, పెరుగు (లేదా పాలు) వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మంచిగా పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. సున్నితంగా ఫేస్ ని ఈ ప్యాక్ రాస్తూ మసాజ్ చేయాలి. 15 నిమిషాల పాటు దానిని అలానే వదిలేసి.. తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా మసాజ్ చేస్తూ, ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఎలా వాడాలి?
మీరు ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు మాత్రమే మీ ముఖంపై అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖంపై ఎప్పుడు ఉపయోగించినా, ముందుగా మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోండి. ఆ తర్వాత మాత్రమే ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించండి. దీని నుండి మీకు చాలా తేడా కనిపిస్తుంది. ఏదైనా ప్రయత్నించే ముందు..ప్యాచ్ టెస్టు చేసుకోవడం చాలా ముఖ్యం.
ఈ ఫేస్ ప్యాక్ వల్ల ప్రయోజనాలు..
ఈ ఫేస్ ప్యాక్ రాయడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది. చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మానికి లభిస్తాయి. కనీసం వారానికి రెండు సార్లు వాడితే.. మీకు మంచి ఫలితాలు కనపడతాయి.